బుల్లెట్ బండి నడపడమే కాదు... రిపేర్లు కూడా చేస్తుంది!
‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా... డుగ్గు... డుగ్గు మని’... ఇటీవల ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు తగ్గట్లే యువతలో బుల్లెట్ బండికి బోలెడు క్రేజ్ ఉంది.
‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా... డుగ్గు... డుగ్గు మని’... ఇటీవల ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు తగ్గట్లే యువతలో బుల్లెట్ బండికి బోలెడు క్రేజ్ ఉంది. అయితే ఎంతో బరువైన ఈ బైక్‌ను అమ్మాయిలు తోలడం అరుదనే చెప్పాలి. కానీ కేరళకు చెందిన ఓ అమ్మాయి బుల్లెట్‌ను నడపడమే కాదు.. ఏకంగా మరమ్మతులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనే 18 ఏళ్ల దియా జోసెఫ్.
బుల్లెట్ బండ్లను బాగు చేస్తూ!
కేరళలోని కొట్టాయంకు చెందిన జోసెఫ్ డొమినిక్‌కు మోటార్ సైకిల్ మెకానిక్‌గా 30 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా బుల్లెట్ బండ్ల సర్వీస్‌లు, మరమ్మతుల విషయంలో అతను ఎంతో నేర్పరి. ప్రస్తుతం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మెకానిక్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో జోసెఫ్ చిన్న కూతురు దియా కూడా అతడి పనుల్లో పాలుపంచుకుంటోంది. తమ వర్క్‌షాప్‌కు వచ్చే బుల్లెట్ బైక్‌లకు ఆయిల్ మార్చడం, ఇతర మరమ్మతులు వంటివి చేస్తోంది. ఈ క్రమంలో తన పనితనంతో వాహనదారుల మన్ననలు అందుకుంటోంది.
రోజుకు రూ.2 వేలు!
చిన్నప్పటి నుంచి తండ్రి చేసే పనులు చూస్తూ పెరిగిన దియా...రెండేళ్ల క్రితం వర్క్‌షాప్‌లోకి అడుగుపెట్టింది. మరమ్మతులకు గురైన బుల్లెట్ బండ్లను ఎలా బాగు చేయాలో నేర్చుకుంది. వేసవి సెలవులతో పాటు వీలు కుదిరినప్పుడల్లా వర్క్‌షాప్‌కి వచ్చి తండ్రికి చేదోడువాదోడుగా నిలిచింది. ప్రస్తుతం రోజుకు కనీసం 2-3 బైక్‌లను రిపేర్ చేస్తోన్న దియా 2 వేల రూపాయల వరకు సంపాదిస్తోంది.
సోదరితో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలి!
‘బుల్లెట్ బైక్‌లతో పాటు వాటి స్పేర్ పార్ట్స్ ఎంతో బరువుగా ఉంటాయి. అందుకే ప్రారంభంలో వాటిని హ్యాండిల్ చేయలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే క్రమంగా వాటిని అధిగమించాను. వాహనాల మరమ్మతుల విషయంలో ఎంతో అనుభవం సంపాదించాను. నేను ఇప్పుడు నాన్న నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. ఒక వేళ ఆయన ఇవ్వబోతే...వాటి బదులు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చివ్వమని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు బుల్లెట్ తోలడమంటే చాలా ఇష్టం. ఇంట్లో థండర్ బోల్ట్ బుల్లెట్ బైక్ ఉంది. నా పుట్టిన రోజుకు నాన్న దీనిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే నా సోదరిని ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనుంది’ అని అంటోందీ బుల్లెట్ క్వీన్.
చదువులోనూ చురుకే!
పిన్న వయసులోనే మెకానిక్‌గా రాణిస్తోంది దియా. అలాగని చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ఇంటర్లో ఏకంగా 98 శాతం మార్కులు సాధించింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేయాలన్నది ఈ అమ్మాయి లక్ష్యమట.
‘నా పెద్ద కూతురు డిజైనింగ్ రంగంలో రాణించాలనుకుంటోంది. ఇక నా చిన్న కూతురు (దియా) మెకానికల్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపిస్తోంది. వారి ఇష్టాయిష్టాలు, అభిరుచులను నేను ఎప్పుడూ ప్రోత్సహిస్తాను. ఇక దియా విషయానికొస్తే...తనకు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్ అంశాల పట్ల ఆసక్తి ఉంది. ఒకసారి చెబితే చాలు.. వెంటనే మెదడులోకి ఎక్కించుకుంటుంది. బుల్లెట్ బండ్లకు ఆయిల్ ఛేంజ్, ఇతర మరమ్మతులను సులభంగా చేయగలుగుతుంది. ఇప్పుడు మెకానికల్ ఇంజినీరింగ్‌లోనే తన కెరీర్ వెతుక్కోవాలనుకుంటోంది. ఓ తండ్రిగా నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను. మరికొంతమంది అమ్మాయిలు మెకానికల్ రంగంలోకి వచ్చేందుకు దియా స్ఫూర్తినిస్తుంది’ అని అంటున్నాడు డొమినిక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!