విద్యార్థినులకు ఆ వెసులుబాటు

నెలసరి ఇబ్బందులతో చదువుపై దృష్టి పెట్టడం అంత తేలిక్కాదు. ఆ సమయంలో మాకు విశ్రాంతి కావాలంటూ కేరళ విద్యార్థినులు నెలసరి సెలవులని పోరాడి సాధించుకుంటే.. గర్భధారణ హాజరుకి ఆటంకం కాకూడదంటూ మరో యూనివర్సిటీ మాతృత్వ సెలవులని ప్రకటించింది.

Published : 20 Jan 2023 00:57 IST

నెలసరి ఇబ్బందులతో చదువుపై దృష్టి పెట్టడం అంత తేలిక్కాదు. ఆ సమయంలో మాకు విశ్రాంతి కావాలంటూ కేరళ విద్యార్థినులు నెలసరి సెలవులని పోరాడి సాధించుకుంటే.. గర్భధారణ హాజరుకి ఆటంకం కాకూడదంటూ మరో యూనివర్సిటీ మాతృత్వ సెలవులని ప్రకటించింది. ఆ స్ఫూర్తి దేశంలోని ఇతర కళాశాల అమ్మాయిలకూ ప్రయోజనాలు అందివ్వనుంది..

డిలో, కళాశాలలో హాజరుశాతం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. కానీ నెలసరి ఇబ్బందులతో బాధపడే అమ్మాయిలు ఆ రోజుల్లోనూ పంటిబిగువున బాధను భరించి విద్యాలయాలకు రావాల్సిందేనా? కుసాట్‌ (కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) విద్యార్థినులు నెలలో రెండు రోజులు నెలసరి సెలవులు కావాలని నమితాజార్జ్‌ ఆధ్వర్యంలో పోరాటం చేశారు. సమస్యను అర్థం చేసుకున్న విశ్వవిద్యాలయం తప్పనిసరి హాజరులో 2 శాతాన్ని మినహాయించింది. ఈ వెసులుబాటుని ఇతర కాలేజీలకూ, పాఠశాల విద్యార్థినులకూ కూడా ఇవ్వాలని కేరళ జెండర్‌ కౌన్సిల్‌ ఆలోచిస్తోంది. ‘పిల్లలు నెలసరి ఇబ్బందులతోనే బలవంతంగా బడులకు వస్తుంటారు. ఇది వారిలో మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఆ సమస్య లేకుండా చేసేందుకు పాఠశాలల్లోనూ నెలసరి సెలవుల గురించి ఆలోచిస్తున్నాం’ అంటున్నారు జెండర్‌ కౌన్సిల్‌ సభ్యురాలు పూర్ణిమ నారాయణ.
మంచి నిర్ణయం: పెళ్లి తర్వాతా కొంతమంది అమ్మాయిలు చదువుని కొనసాగిస్తున్నారు. అటువంటివారికి గర్భధారణ, అబార్షన్‌ వంటివి అవరోధాలు కాకూడదని కేరళలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రెండు నెలలపాటు మాతృత్వ సెలవులని ప్రకటించింది. ప్రసవానికి ముందు లేదా తర్వాత వెసులుబాటుని బట్టి ఈ సెలవులని తీసుకోవచ్చట. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకూ, తొలి రెండు కాన్పులకు మాత్రమే ఈ సెలవులని ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్