షాంపూలో వీటిని కలిపి స్నానం చేస్తే..!

షాంపూను నేరుగా కాకుండా కాసిన్ని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మనకు తెలిసిందే. అయితే కేవలం నీటిలోనే కాకుండా కొన్ని పదార్థాలనూ షాంపూలో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా జుట్టు మరింత ఆరోగ్యంగా....

Published : 16 Jun 2023 15:47 IST

షాంపూను నేరుగా కాకుండా కాసిన్ని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మనకు తెలిసిందే. అయితే కేవలం నీటిలోనే కాకుండా కొన్ని పదార్థాలనూ షాంపూలో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా జుట్టు మరింత ఆరోగ్యంగా మారుతుంది. అవేంటో చూద్దాం..

రోజ్‌వాటర్‌లో షాంపూను కలిపి తలస్నానం చేస్తే కుదుళ్లు దురద పెట్టవు. అంతేకాదు.. జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మెరుస్తుంది.

షాంపూలో కాస్త ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి చూడండి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడడం తగ్గడమే కాకుండా మరింత ఒత్తుగా పెరుగుతుంది.

జుట్టు జీవం కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంటే.. షాంపూలో నిమ్మరసం కలిపి చూడండి. వెంట్రుకలు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మెరుస్తాయి.

షాంపూలో కాస్త తేనె కలిపితే జుట్టు పొడిబారిపోకుండా తేమగా ఉంటుంది. తేనె కుదుళ్లను ఆరోగ్యంగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని