Pranitha: బాపూ బొమ్మకు సీమంతం!

‘మాతృత్వంలోని మాధుర్యమేంటో అనుభవిస్తే గానీ అర్థం కాదు..’ అంటోంది బాపూ బొమ్మ ప్రణీత సుభాష్‌. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. గర్భిణిగా తన ప్రతి అనుభూతినీ అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా........

Published : 17 May 2022 15:03 IST

(Photos: Instagram)

‘మాతృత్వంలోని మాధుర్యమేంటో అనుభవిస్తే గానీ అర్థం కాదు..’ అంటోంది బాపూ బొమ్మ ప్రణీత సుభాష్‌. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. గర్భిణిగా తన ప్రతి అనుభూతినీ అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోల్ని పంచుకుందీ చక్కనమ్మ. ఇందులో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయిన ఈ కాబోయే అమ్మ ముఖంలో ప్రెగ్నెన్సీ కళ ఉట్టిపడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సినిమాలతోనే కాకుండా.. తన సేవతోనూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది నటి ప్రణీత. గతేడాది బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల తార.. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు గత నెలలో ప్రకటించింది. ఇక అప్పట్నుంచి తన బేబీ బంప్‌ ఫొటోల్ని, కాబోయే అమ్మగా తాను ఎదుర్కొంటోన్న అనుభవాల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది ప్రణీత.

సీమంతంలో బుట్టబొమ్మలా..!

తాజాగా ఈ బుట్టబొమ్మకు సీమంతం వేడుక నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. ఇందులో భాగంగా సంప్రదాయబద్ధమైన చీరకట్టులో ముస్తాబైంది ప్రణీత. పసుపు-గులాబీ రంగులు కలగలిసిన పట్టుచీర ధరించిన ఆమె.. బంగారు ఆభరణాలతో తన లుక్‌కి వన్నెలద్దింది. చేతుల నిండా గోరింటాకు, మోముపై చిరునవ్వు ఆమె ప్రెగ్నెన్సీ కళను ఇనుమడింపజేశాయని చెప్పచ్చు. ఇలా తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ చక్కనమ్మ. దీంతో చాలామంది ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. ‘రోజురోజుకీ మీ ముఖంలో ప్రెగ్నెన్సీ కళ రెట్టింపవుతోంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చాక్లెట్‌ క్రేవింగ్స్‌ ఉన్నాయి!

ఇక ‘ఎప్పుడూ కలవని వ్యక్తితో మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా?’ అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగానే హింట్‌ ఇచ్చిన ప్రణీత.. గత నెలలో తన భర్త పుట్టిన రోజు సందర్భంగా అసలు విషయం బయటపెట్టింది. అల్ట్రాసౌండ్‌ స్కాన్, ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటోల్ని పోస్ట్‌ చేస్తూ.. ‘మా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ దేవతలు మాకు ఓ గొప్ప బహుమతి ఇచ్చారు..’ అంటూ తాను గర్భిణినని ప్రకటించింది. అంతేకాదు.. ఈ సమయంలో తన ఆహారపు కోరికల్ని కూడా బయటపెట్టిందీ టాలీవుడ్‌ బ్యూటీ.
‘గర్భం ధరించిన సమయంలో ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ఆహారపు కోరికలు కలుగుతుంటాయి. నా విషయంలోనైతే.. చాక్లెట్స్‌ విపరీతంగా తింటున్నా. రాజ్‌తో లేట్‌నైట్ డ్రైవ్స్‌కి వెళ్లినప్పుడల్లా ఐస్‌క్రీమ్స్‌ లాగించేస్తున్నా. మా అమ్మ గైనకాలజిస్ట్‌. ప్రెగ్నెన్సీ విషయంలో నాకు బోలెడన్ని సలహాలిస్తోంది. మరోవైపు స్నేహితులు/సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచీ ఈ తరహా సలహాలు అందుతున్నాయి.. ఈ అనుభూతులన్నీ అనుభవిస్తే కానీ అర్థం కావు..’ అంటూ చెప్పుకొచ్చిందీ కాబోయే అమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్