చనుబాల ఉత్పత్తి తగ్గేదెలా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 27. ప్రస్తుతం నాకు ఏడు నెలల బాబున్నాడు. డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్‌ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫీడింగ్‌ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ నేను నా బాబుకు పూర్తిగా నా పాలే...

Published : 12 May 2023 14:07 IST

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 27. ప్రస్తుతం నాకు ఏడు నెలల బాబున్నాడు. డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్‌ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫీడింగ్‌ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ నేను నా బాబుకు పూర్తిగా నా పాలే ఇస్తున్నాను. అయినా అదనంగా ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తవుతున్నాయి. ఇటు అధిక పాల ఉత్పత్తి, అటు నెలసరితో చాలా ఇబ్బందిగా ఉంది. నాకు, నా బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. చనుబాలు మరీ ఎక్కువగా ఉత్పత్తి (ఓవర్‌ ఫ్లో) కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాగే బిడ్డకు పాలిస్తున్నప్పుడు పిరియడ్స్‌ రావడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? చెప్పండి. - ఓ సోదరి

జ: మీరు రెండు సమస్యల గురించి చెప్పారు. ఒకటి - పాలు ఎక్కువగా ఉత్పత్తవుతున్నాయని, రెండోది - పాలిస్తున్నా కూడా నెలసరి వస్తోందని. సాధారణంగా బిడ్డ పూర్తిగా చనుబాల మీదే ఆధారపడి ఉంటే పిరియడ్స్‌ తిరిగి మొదలు కావు. కానీ మీ బాబుకు ఏడు నెలలు కాబట్టి మీరు ఘనాహారం కూడా మొదలుపెట్టి ఉంటే పిరియడ్స్‌ సాధారణంగానే వస్తాయి. పాల ఉత్పత్తి తగ్గించడానికి మందులనేవి ఉండవు. పాలు బిడ్డ అవసరాన్ని బట్టి ఉత్పత్తవుతాయి కాబట్టి నెమ్మదిగా మీ బాబుకి ఘనాహారం అలవాటు చేసి.. క్రమంగా పాలివ్వడం తగ్గించేస్తే వాటికవే తగ్గిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్