ఒకే బోర్డు.. ఎన్నో పనులు!

కాయగూరలు కట్‌ చేయాలంటే చాపింగ్‌ బోర్డుతో పాటు చాకు, స్లైసర్‌, వాటిని అమర్చుకోవడానికి వేర్వేరు గిన్నెలు.. ఇవన్నీ అవసరమే! ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కో చోట అమర్చడం వల్ల కొన్నిసార్లు అవి దొరక్కపోవచ్చు. అలాకాకుండా అన్నీ ఒకే చోట అమర్చుకునే అవకాశం ఉంటే.. అదెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా?

Published : 15 Jun 2024 12:34 IST

కాయగూరలు కట్‌ చేయాలంటే చాపింగ్‌ బోర్డుతో పాటు చాకు, స్లైసర్‌, వాటిని అమర్చుకోవడానికి వేర్వేరు గిన్నెలు.. ఇవన్నీ అవసరమే! ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కో చోట అమర్చడం వల్ల కొన్నిసార్లు అవి దొరక్కపోవచ్చు. అలాకాకుండా అన్నీ ఒకే చోట అమర్చుకునే అవకాశం ఉంటే.. అదెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ‘మల్టీఫంక్షనల్‌ చాపింగ్‌ బోర్డు’తో!

ఫొటోలో చూపినట్లుగా బాక్స్‌ మాదిరిగా ఉంటుందీ బోర్డు. పైన కాయగూరలు కట్‌ చేసుకోవడానికి వీలుగా చాపింగ్‌ బోర్డులా, బాక్స్‌ ఓపెన్‌ చేస్తే.. అందులో చాకులు, వివిధ రకాల స్లైసర్స్‌ అమర్చునేందుకు ప్రత్యేక అరలుంటాయి. ఇక ఈ బోర్డుకు మధ్య భాగంలో ఉన్న అటాచ్‌మెంట్‌ని తొలగించి.. దాని స్థానంలో వివిధ రకాల స్లైసర్స్‌ని అమర్చుకొని.. ఉపయోగించుకోవచ్చు. ఇక బాక్స్‌ అడుగుభాగంలో జాలీ తరహా ఫోల్డబుల్‌ బాక్స్‌ ఒకటి చాపర్‌కు అనుసంధానమై ఉంటుంది. కట్‌ చేసిన కాయగూరల్ని ఇందులో వేసుకొని.. శుభ్రం చేసుకోవచ్చు. ఇలా ఒక చాపింగ్‌ బోర్డుతో ఎన్నో రకాల పనులు చేసుకోవచ్చు.

అంతేకాదు.. ఇందులోనూ చెక్కతో చేసిన చాపింగ్‌ బోర్డులు కూడా దొరుకుతున్నాయి. వీటి అడుగున వివిధ రకాల ర్యాక్స్‌ అమరి ఉంటాయి. నాలుగైదు రకాల కాయగూరల్ని ఒకేసారి కట్‌ చేసుకొని వీటిలో నిల్వ చేసుకోవచ్చు.. ఇలా కాయగూరలన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే వంట కూడా త్వరగా, సులభంగా పూర్తవుతుంది. అలాంటి మల్టీఫంక్షనల్‌ చాపింగ్‌ బోర్డులపై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్