మఫిన్ కప్స్‌ని ఇలా కూడా వాడచ్చు!
కప్ కేక్స్/మఫిన్స్ తయారుచేయడానికో లేదంటే బేకింగ్ కోసమో.. మఫిన్ కప్స్ వాడడం మనకు అలవాటే! అయితే వీటిని ఇతరత్రా పనుల కోసం కూడా ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..!
కప్ కేక్స్/మఫిన్స్ తయారుచేయడానికో లేదంటే బేకింగ్ కోసమో.. మఫిన్ కప్స్ వాడడం మనకు అలవాటే! అయితే వీటిని ఇతరత్రా పనుల కోసం కూడా ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..!
* ఇంటికి అతిథులొచ్చినప్పుడో లేదంటే పిల్లల బర్త్‌డే పార్టీల్లోనో విడివిడిగా స్వీట్లు, స్నాక్స్ సర్వ్ చేయాలనుకుంటాం. అందుకోసం ఈ మఫిన్ కప్స్‌ని ఉపయోగించుకోవచ్చు. పిల్లల చేతిలో ఇవి ఇట్టే ఇమిడిపోతాయి కూడా!
* చక్కెర, మసాలాలు, జామ్.. వంటి ఆహార పదార్థాల్ని గాలి తగలకుండా నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటిని నిల్వ ఉంచిన గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బా మూతి వద్ద ఈ కప్స్‌ని ఉంచి.. ఆపై మూతను బిగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* రంగురంగుల, విభిన్న ప్రింట్లతో కూడిన మఫిన్ కప్స్‌ని స్టార్స్, త్రిభుజాకారం.. ఇలా నచ్చినట్లుగా కట్ చేసుకొని.. తోరణంలా తయారుచేసుకొని హాల్ గోడకు అలంకరించచ్చు. బర్త్‌డే పార్టీ కోసమైతే వాటిపైనే ‘హ్యాపీ బర్త్‌డే’ అని రాసి.. గోడకు వేలాడదీయచ్చు.. ఇలా ఆలోచిస్తే వీటితో ఇంటి అలంకరణకు సంబంధించిన ఐడియాలు బోలెడొస్తాయి.
* పిల్లలు మనలా ఐస్‌క్రీమ్‌ను గబగబా తినలేరు. దాంతో ఎండ వేడికి అది కరిగి మీద పడుతుంటుంది. అలాంటప్పుడు ఐస్‌క్రీమ్ పుల్లకు కింది వైపు ఓ మఫిన్ కప్‌ని తొడిగితే సరి!
* క్యాండిల్స్‌ని వెలిగించి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల ఆ మైనం ఉపరితలానికి అంటుకుపోతుంది. ఇక దాన్ని తొలగించడం కాస్త కష్టమే! కాబట్టి మీరు వెలిగించిన క్యాండిల్స్‌ని మఫిన్ కప్‌లో ఉంచి మీకు కావాల్సిన చోట ఉంచండి.. ఆకర్షణీయంగానూ ఉంటుంది.. శ్రమా తగ్గుతుంది.
* కొద్దికొద్దిగా మిగిలిపోయిన స్నాక్స్, సాస్, కొత్తిమీర తరుగు/పుదీనా తరుగు.. వంటివి సిలికాన్ లైనింగ్‌తో ఉన్న మఫిన్ కప్స్‌లో నిల్వ చేసుకోవచ్చు.
* జెమ్ క్లిప్స్, బులిటెన్ బోర్డ్ నీడిల్స్, నోటీస్ బోర్డ్ క్లిప్స్.. వంటి చిన్న చిన్న వస్తువుల్ని విడివిడిగా అమర్చుకోవడానికీ మఫిన్ కప్స్‌ని వాడచ్చు.
* బీడ్స్, కుందన్స్, చెమ్కీలు.. వంటి ఎంబ్రాయిడరీకి సంబంధించిన వస్తువుల్ని సైతం మఫిన్ కప్స్‌లో వేటికవే విడివిడిగా అమర్చుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!