‘ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నావా..’ అని వేధిస్తున్నాడు!

నేను ఎంబీఏ చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఆఫీసులో నా బాస్‌ అనవసరమైన ప్రశ్నలు వేసి వేధిస్తున్నాడు. ‘నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? మీ జనరేషన్ అంతా ఇలాగే ఉందిగా..’ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు.

Published : 14 Jun 2024 21:58 IST

(Representational Image)

నేను ఎంబీఏ చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఆఫీసులో నా బాస్‌ అనవసరమైన ప్రశ్నలు వేసి వేధిస్తున్నాడు. ‘నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? మీ జనరేషన్ అంతా ఇలాగే ఉందిగా..’ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ వ్యక్తిగత విషయాల గురించి అడుగుతుంటాడు. అతని మాటలు నాకు నచ్చడం లేదని తెలిసినా కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అతని హోదా వల్ల గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నా. అతనికి ఎలా బుద్ధి చెప్పాలి? - ఓ సోదరి

జ. మీ పైఅధికారి మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని అంటున్నారు. అలాగే అతని హోదా వల్ల గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నానని అంటున్నారు. కాబట్టి, దానికి బదులుగా ఇతర మార్గాలను అన్వేషించండి. మెయిల్‌ చేయడం, టెక్స్ట్‌ మెసేజ్‌ పెట్టడం వంటివి ఇందులో భాగమే. వీటిలో ఏదో ఒకటి ప్రయత్నించి చూడండి. ఎప్పుడైతే మీ అభిప్రాయాన్ని అవతలి వ్యక్తికి స్పష్టంగా చెప్పగలుగుతారో.. వారికి బలమైన సందేశం వెడుతుంది. అప్పుడు తన ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ అతనితో ఇలా పరోక్షంగా కూడా మాట్లాడడం ఇష్టం లేకపోతే ఇతర మార్గాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని పరిశీలించండి. చాలా సంస్థల్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు ఉంటాయి. మీ ఆఫీసులో అలాంటిది ఉంటే అక్కడ ఫిర్యాదు చేయండి. అతని ప్రవర్తన భరించలేనిదిగా ఉంటే హెచ్‌ఆర్‌ విభాగంలో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులతో ఇలా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి, అతనికి బుద్ధి చెప్పడానికి మీకున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే సహోద్యోగుల సహాయం కూడా తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్