దానివల్ల స్కూల్‌కి వెళ్లనని ఏడుస్తోంది.. ఏం చేయాలి?
మా పాప వయసు 12 ఏళ్లు. చిన్నప్పటి నుండి తను చదువులో కాస్త వెనకబడే ఉంటోంది. నేను ఎంత శ్రద్ధ పెట్టినా తనలో మార్పు రావడం లేదు. కోప్పడితే పెద్దగా ఏడుస్తుంటుంది. లెక్కలు అస్సలు అర్థం కావడం లేదని, స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తోంది. దయచేసి మా అమ్మాయిలో....
మా పాప వయసు 12 ఏళ్లు. చిన్నప్పటి నుండి తను చదువులో కాస్త వెనకబడే ఉంటోంది. నేను ఎంత శ్రద్ధ పెట్టినా తనలో మార్పు రావడం లేదు. కోప్పడితే పెద్దగా ఏడుస్తుంటుంది. లెక్కలు అస్సలు అర్థం కావడం లేదని, స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తోంది. దయచేసి మా అమ్మాయిలో మార్పు వచ్చే మార్గం చెప్పగలరు. - ఓ సోదరి.
జ. మీ పాప వయసు 12 ఏళ్లే అంటున్నారు. ఇది అంత పెద్ద వయసు కాదు. కాబట్టి చదువు విషయంలో ఎక్కువగా కంగారు పడకండి. అయితే అందరు పిల్లలు చదువులో రాణించాలనే నియమం ఏమీ లేదు. కొంతమంది చదువులో రాణించకపోయినా స్పోర్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్.. వంటి ఇతర వ్యాపకాల్లో చురుగ్గా ఉంటారు. కాబట్టి మీ పాప విషయంలో కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా ఇలాంటి నైపుణ్యాలను కూడా పరిచయం చేసి చూడండి. దానివల్ల తను కొంచెం రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చదువుపై కూడా తన దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. అలాగే తనకు లెక్కలు అస్సలు అర్థం కావడం లేదని అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టించే మార్గాన్ని పరిశీలించండి.
ఒకవేళ మీ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితం రాకపోతే మంచి సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లండి. వారు మీ పాపను పరిశీలించి ఆటిజం, ఏడీహెచ్‌డి, లెర్నింగ్ డిజెబిలిటీ వంటి సమస్యలు ఉన్నాయా? అనేది చెక్ చేస్తారు. దాన్ని బట్టి తగిన సూచనలు ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.