ఇలా స్నానం చేస్తే అలసట మాయం..!

ఈసారి మార్చిలోనే ఎండలు ఠారెత్తించేస్తున్నాయి. సూర్యుడు నడినెత్తిన తాండవం చేస్తున్నాడు. అధిక వేడి, ఉక్కపోత, చెమట.. వీటన్నిటి కారణంగా రోజు ముగిసే సరికి అలసిపోవడం ఖాయం. మరి, ఆ అలసటను దూరం చేసుకొని తిరిగి ఉత్సాహాన్ని పొందాలంటే ఏం చేయాలి?? దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తూ స్నానం చేస్తే సరిపోతుంది.....

Updated : 24 Mar 2022 17:23 IST

ఈసారి మార్చిలోనే ఎండలు ఠారెత్తించేస్తున్నాయి. సూర్యుడు నడినెత్తిన తాండవం చేస్తున్నాడు. అధిక వేడి, ఉక్కపోత, చెమట.. వీటన్నిటి కారణంగా రోజు ముగిసే సరికి అలసిపోవడం ఖాయం. మరి, ఆ అలసటను దూరం చేసుకొని తిరిగి ఉత్సాహాన్ని పొందాలంటే ఏం చేయాలి?? దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తూ స్నానం చేస్తే సరిపోతుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలేంటి? వాటి వల్ల మనకు కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

అలసిన చర్మానికి సాంత్వన చేకూర్చి తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే గుణాలు కొన్ని సహజసిద్ధమైన పదార్థాల్లో మెండుగా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే చెమట, అలసటకు చెక్ పెట్టడమే కాదు.. తిరిగి ఉత్సాహవంతంగా మారడం అంత కష్టమేం కాదంటున్నారు సౌందర్య నిపుణులు.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో..

స్నానం చేసే నీళ్లలో రెండు కప్పుల యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. బాత్‌టబ్‌లో స్నానం చేసేటట్లయితే ఆ నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలపాటు శరీరం మునిగి ఉండేలా చేస్తే చాలు.. సూర్యరశ్మి కారణంగా కమిలిపోయిన చర్మం తిరిగి తాజాగా మారడంతోపాటు అలసట కూడా దూరమవుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం పైపొరల్లో పేరుకుపోయిన మలినాలు, మృతకణాలను తొలగించి తిరిగి మేను ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.


నిమ్మరసం, రోజ్‌వాటర్‌తో..

కావాల్సినవి:

* నిమ్మరసం- అరకప్పు

* రోజ్‌వాటర్- 5 చెంచాలు

స్నానం చేసే నీళ్లలో ఈ రెండింటినీ వేసి బాగా కలపాలి. ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం కావడమే కాకుండా తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది. నిమ్మరసం చెమటకు చెక్ పెట్టి, జిడ్డుదనాన్ని నివారిస్తే, రోజ్‌వాటర్ మనల్ని అధిక సమయం తాజాగా కనిపించేలా చేస్తుంది.


తేనె, వెనిగర్‌తో..

కావాల్సినవి:

* వెనిగర్- 1 కప్పు

* తేనె- 1 చెంచా

ఒక బకెట్ నీళ్లలో కప్పు వెనిగర్, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం ద్వారా వేడి కారణంగా అలసిన చర్మానికి సాంత్వన చేకూరుతుంది. అలాగే చికాకు కూడా తగ్గుతుంది. సూర్యరశ్మి కారణంగా కమిలిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు మృదువుగానూ మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్