plants: ఇంట్లో మొక్కలకు రసాయనాలా?

మొక్కల పెంపకం అంటే ఎంత ఆసక్తి ఉన్నా... వాటికి వచ్చే చీడపీడల్ని వదిలించాలంటే మాత్రం కాస్త ఎక్కువే కష్టపడాలి. అలాగని ఇంట్లో పెంచే వాటికి రసాయన ఎరువులు వాడితే వాటితో పాటూ మనకీ హానికారమే.

Published : 07 May 2023 00:21 IST

మొక్కల పెంపకం అంటే ఎంత ఆసక్తి ఉన్నా... వాటికి వచ్చే చీడపీడల్ని వదిలించాలంటే మాత్రం కాస్త ఎక్కువే కష్టపడాలి. అలాగని ఇంట్లో పెంచే వాటికి రసాయన ఎరువులు వాడితే వాటితో పాటూ మనకీ హానికారమే. సహజంగా వాటిని అరికట్టాలనుకుంటే ఇలా ప్రయత్నించి చూడండి.

* వేప: ఘాటైన వాసనను, చేదు రుచినీ కలిగి ఉండే వేప పిండి, నూనెలు సహజ క్రిమి సంహారకాలుగా  పనిచేస్తాయి. కప్పు వేప నూనెలో ఐదారు చుక్కల లిక్విడ్‌ సోప్‌, కొన్ని గోరువెచ్చని నీళ్లు కలిపి మొక్కలపై చల్లి చూడండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే చాలు..క్రమంగా సమస్య దూరమవుతుంది.

* శీకాకాయ: శీకాకాయ గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఆ నీటిని వడకట్టి మొక్కలపై పిచికారీ చేస్తే సరి...చీడపీడలు తగ్గుముఖం పడతాయి.

* అల్లం- మిరప- వెల్లుల్లి! : ఈ మూడింటినీ తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ని లీటరు నీటిలో కరిగించి మొక్కలపై స్ప్రే చేస్తే తెల్లదోమ, బూడిద తెగులు వంటివి తగ్గుతాయి.

* వెల్లుల్లి- మిరియాలు- ఆలివ్‌నూనె: ఐదారు వెల్లుల్లి రెబ్బలను, చెంచా మిరియాలు మెత్తగా చేసి కాస్త ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లితే తెల్లదోమలు పోతాయి.

* పసుపు- బేకింగ్‌ సోడా! పసుపులో సహజంగా యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి ఈగలూ, చీమలు వంటివాటిని చక్కగా అరికడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్