Updated : 11/03/2023 19:09 IST

మెరిసే జుట్టు.. సహజంగానే.. ఇలా!

కేశాలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఆహారం ద్వారా అందించే పోషకాలతో పాటు హెయిర్ మాస్క్‌ల ద్వారా కూడా బయట నుంచి పోషణ అందించాలి. అలాంటి కొన్ని హెయిర్ మాస్క్స్:

స్ట్రాబెర్రీలతో..

కావాల్సినవి:

స్ట్రాబెర్రీలు- (మీ జుట్టు పొడవుని బట్టి సరిపడినన్ని)

కొబ్బరినూనె- ఒక చెంచా

తేనె- ఒక చెంచా

తయారీ:

పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్‌లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత జుట్టుకి అప్త్లె చేసి కాసేపు ఆరనివ్వాలి. గోరువెచ్చగా ఉన్న నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి.. నిగనిగలాడే కురులే కాదు.. చక్కటి సువాసన కూడా వస్తుంది.


పెరుగుతో..

కావాల్సినవి:

తేనె- అరకప్పు

పెరుగు- అరకప్పు

బాదం నూనె- ఒక చెంచా

తయారీ:

ఇవన్నీ ఒక బౌల్‌లో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.


కోడిగుడ్డు సొనతో..

కావాల్సినవి:

కోడిగుడ్డు సొన - 1

తేనె- ఒక చెంచా

ఆలివ్ ఆయిల్- ఒక చెంచా

క్యాస్టర్ ఆయిల్- ఒక చెంచా

ఆర్గన్ ఆయిల్- ఒక చెంచా

తయారీ:

ముందు కోడిగుడ్డు సొన ఒక పాత్రలో వేసుకుని బాగా గిలకరించాలి. తర్వాత తేనె, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత మంచి షాంపూ, కండిషనర్‌తో జుట్టుని శుభ్రపరుచుకుంటే సరి.. నిగనిగలాడే కురులు సొంతమవుతాయి.


మందారతో..

కప్పుకి సరిపడా మందార పూల రేకుల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తగా చేసి దానికి ఆలివ్‌నూనెని జత చేసి మాడుకి రాయాలి. గంట తర్వాత శుభ్రంగా నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే కేశాలు మెత్తబడటమే కాక మెరుపును కూడా సంతరించుకుంటాయి.

ఇవే కాకుండా ఇతరత్రా వివిధ రకాల హెయిర్‌మాస్క్‌లు మనం ప్రయత్నించవచ్చు. అయితే మనకి ఏది నప్పుతుంది అనేది సొంతంగా నిర్ణయించేసుకోకుండా సౌందర్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని