బీట్రూట్ లిప్ స్టెయిన్ ఇంట్లోనే చేద్దాం...!
అధరాలు అందంగా కనిపించడం కోసం వాడే లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటి రకరకాల సౌందర్య సాధనాల గురించి మనందరికీ తెలుసు. లిప్‌స్టిక్ తయారీలో వాడే రకరకాల రసాయనాలకు భయపడి కొంతమంది వాటి జోలికి వెళ్లరు. సహజమైన పదార్థాలతో తయారయే ఆర్గానిక్ లిప్‌స్టిక్ లు, బ్రాండెడ్ లిప్‌స్టిక్‌లు చాలా ఖరీదు.
అధరాలు అందంగా కనిపించడం కోసం వాడే లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటి రకరకాల సౌందర్య సాధనాల గురించి మనందరికీ తెలుసు. లిప్‌స్టిక్ తయారీలో వాడే రకరకాల రసాయనాలకు భయపడి కొంతమంది వాటి జోలికి వెళ్లరు. సహజమైన పదార్థాలతో తయారయే ఆర్గానిక్ లిప్‌స్టిక్ లు, బ్రాండెడ్ లిప్‌స్టిక్‌లు చాలా ఖరీదు. ఎంత ఖరీదైన లిప్‌స్టిక్ వాడినా సహజమైన అధర సౌందర్యాన్ని మించిన అందం లేదు కదా..! లిప్ స్టెయినింగ్ అనే పద్ధతి ద్వారా సహజమైన పద్ధతిలో మీ పెదాలకు నచ్చిన రంగులు అద్దవచ్చు. పైగా ఎటువంటి హానికారక రసాయనాలు లేకుండా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా..!
లిప్ స్టెయిన్ తయారీ
కావాల్సినవి..
* రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం
* ఒక టీస్పూను జిలెటిన్ పౌడరు
* ఒక టీస్పూను వేడి నీరు
* అర టీస్పూను గ్లిజరిన్
తయారీ...
ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలపాలి. మిశ్రమం సరిగా కలవనట్లు అనిపిస్తే ఒక నిమిషం పాటు ఒవెన్‌లో వేడి చేయాలి లేదా మరుగుతున్న నీటి పాత్రలో అర నిమిషం ఉంచాలి.
ఎలా వాడాలి..?
ముందుగా పెదవులు పగుళ్లు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తక్కువ మోతాదులో మాయిశ్చరైజర్ అప్త్లెచేయాలి. మాయిశ్చరైజర్ ఎక్కువైతే లిప్ స్టెయిన్ సరిగా నిలవదు, అసలు మాయిశ్చరైజర్ వాడక పోతే లిప్ స్టెయిన్ గీతలు గీతలుగా ఉంటుంది. అందుకని తక్కువ మోతాదులో వాడాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన లిప్ స్టెయిన్ మిశ్రమాన్ని పెదవులకు ప్యాక్‌లా వేసుకోవాలి.
ఈ ప్యాక్ ఆరిన తర్వాత పొరలా తయారవుతుంది. అప్పుడు ఆ పొరను పీల్ చేస్తే ఎర్రని పెదాలు మీ సొంతం. లిప్ స్టెయిన్ తర్వాత లిప్ బామ్ వాడితే పెదాలు మరింత అందంగా ఉండడమే కాకుండా పెదవుల రంగు ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
ఈ మిశ్రమంలో వేడి నీటి బదులు కొబ్బరిపాలు లేదా బాదంపాలు(వేరే పదార్థాలు కలవనివి) వాడవచ్చు. బీట్రూట్ రంగు కాకుండా వేరే రంగులు కావాలంటే బీట్రూట్ రసానికి బదులుగా నచ్చిన ఎడిబుల్ ఫుడ్ కలర్(ఆహారంలో వాడదగిన ఫుడ్ కలర్)ను కలుపుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!