వానాకాలంలో.. వ్యాధులకు దూరంగా ఉండాలంటే..!

కాస్త వర్షాలు సాగితే చాలు.. వివిధ రకాల సీజనల్ వ్యాధులు మేమున్నామంటూ గుర్తు చేస్తుంటాయి. ఈ క్రమంలో- దగ్గు,  జలుబు, జ్వరం.. ఇవన్నీ కామన్. అయితే ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌....

Updated : 21 Jul 2023 12:53 IST

కాస్త వర్షాలు సాగితే చాలు.. వివిధ రకాల సీజనల్ వ్యాధులు మేమున్నామంటూ గుర్తు చేస్తుంటాయి. ఈ క్రమంలో- దగ్గు,  జలుబు, జ్వరం.. ఇవన్నీ కామన్. అయితే ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌ తెచ్చుకోవడం, వేసేసుకోవడం చేస్తుంటామే తప్ప.. ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయన్న విషయం మాత్రం ఆలోచించం. అంతేకాదు.. ఏ వ్యాధులూ సోకకుండా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచే సహజసిద్ధమైన ఔషధాలకు మన వంటిల్లు నిలయం.

పసుపు

ఇందులో యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటీ-వైరల్‌, యాంటీ-ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలుంటాయి. కాస్త పసుపును నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అయితే ఇలా పసుపును నీటిలో మరిగించేటప్పుడు అందులో కొన్ని తులసి ఆకులు, అల్లం కూడా జత చేస్తే మరీ మంచిది.

మిరియాలు

వీటిని మనం పసుపుతో కలిపి మరిగించినప్పుడు పసుపులోని సుగుణాలు శరీరం గ్రహించడంలో ఇవి తోడ్పడతాయి. కాబట్టి పసుపుని, మిరియాలను కలిపి వాడినప్పుడు.. వాటిలోని పోషక విలువలు శరీరానికి బాగా అందుతాయి.

వాము, మెంతులు, జీలకర్ర..

ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ సాఫీగా సాగడం వల్ల హ్యాపీ హార్మోన్లు, ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు ఉత్పత్తవుతాయి. వీటితో పాటు కడుపులో గ్యాస్‌, మంట.. వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అందుకే వీటన్నిటినీ కలిపి ఓ గ్లాస్‌ నీళ్లలో మరిగించి కషాయంలా తయారుచేసుకొని రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడానికీ ఈ కషాయం చక్కగా ఉపయోగపడుతుంది.

చూశారుగా.. రోగనిరోధక శక్తిని పెంచుకునే సులభమైన మార్గాలు మన వంటింట్లోనే ఉన్నాయి. కాబట్టి రోజూ వీటిని మీ మెనూలో చేర్చుకోండి.. సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని