నోటి పూత వేధిస్తోందా? అయితే ఇలా చేయండి..!
మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. వంటివన్నీ ఇందుకు కారణాలే! అయితే సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.
మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. వంటివన్నీ ఇందుకు కారణాలే! అయితే సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా??
అసలెందుకీ సమస్య..
నోటి పూత రావడానికి వివిధ రకాల కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
* అధిక ఒత్తిడి
* అప్పుడప్పుడూ మనం తీసుకునే ఆహారం శరీరానికి పడకపోవడం వల్ల..
* నిమ్మ, నారింజ, యాపిల్, టొమాటో, స్ట్రాబెర్రీ.. లాంటి నిమ్మజాతి, ఆమ్ల గుణాలు కలిగిన పండ్లు, కూరగాయలు మోతాదుకు మించి తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
* హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా నోటిపూత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్.. మొదలైనవి లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చట!
* పదే పదే నొప్పి నివారణులు వాడడం వల్ల ఒక్కో దశలో అవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా నోటిపూత రావచ్చు.
* నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు.
తేనెతో ఉపశమనం..
అప్పుడప్పుడూ నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ తిరిగి కణజాలం ఏర్పడడంలో తేనె సహాయపడుతుంది. అలాగే తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. దీనికోసం తేనెలో కాస్త పసుపు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సమస్య ఉన్న భాగంలో రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె, పసుపు మిశ్రమానికి బదులుగా కేవలం తేనెను కూడా ఉపయోగించవచ్చు.
కొబ్బరి వల్ల..
కొబ్బరినీళ్లు, ఎండు లేదా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె.. వీటితో కూడా నోటిపూత దూరమవుతుంది. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గి ఫలితంగా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాయడం, ఎండు లేదా పచ్చి కొబ్బరి నమలడం.. వంటి వాటి వల్ల కూడా సమస్య త్వరగా తగ్గే అవకాశం ఉంది.
పాల పదార్థాలు..
పాల పదార్థాలతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. సమస్య ఉన్న చోట నెయ్యి రాయడం, ప్రతిరోజూ రెండుమూడు సార్లు ఒక గ్లాస్ చొప్పున మజ్జిగ తాగడం.. లాంటివి చేస్తే సమస్య నుంచి సత్వర ఉపశమనం పొందే అవకాశాలుంటాయి.
తులసి ఆకులు
తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలున్నాయి. వీటి వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నోటిలో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకుని.. నీటితో పాటే నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది. అలాగే ఈ సమస్య తిరిగి రాకుండా కూడా ఉంటుంది.
నొప్పి తగ్గాలంటే..
నోటి పూత వల్ల వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. చిన్న ఐస్ ముక్కను తీసుకుని దాంతో గాయం ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రుద్దడం, బాగా చల్లటి నీటితో నోరు శుభ్రపరచుకోవడం.. లాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే లవంగం నమలడం, లవంగం నూనె సమస్య ఉన్న ప్రాంతంలో పూయడం.. వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. అయితే ఈ చిట్కాలన్నీ పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!