చర్మంపై దద్దుర్లు.. నల్ల మచ్చలు.. తగ్గేదెలా?

నా చర్మంపై దద్దుర్లు (ర్యాషెస్‌) వచ్చాయి. దాంతో నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. అవి పోవడానికి ఏవైనా ఇంటి చిట్కాలుంటే చెప్పండి. - ఓ సోదరి....

Published : 31 Oct 2022 19:49 IST

నా చర్మంపై దద్దుర్లు (ర్యాషెస్‌) వచ్చాయి. దాంతో నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. అవి పోవడానికి ఏవైనా ఇంటి చిట్కాలుంటే చెప్పండి. - ఓ సోదరి

జ: దద్దుర్లు అంటే చేతులు-ముఖంపై వచ్చాయా..? లేదంటే శరీరమంతా ఈ సమస్య ఉందా..? ఏదైనా క్రీమ్ లేదా మందులు వాడడం వల్ల శరీరంపై వచ్చిన రియాక్షనా? ఇలా మీ అసలు సమస్య ఏమిటో వివరంగా చెప్పలేదు. ఒకవేళ ముఖంపై వచ్చిన దద్దుర్లు అయితే ఆ ప్రదేశంలో ఐస్‌క్యూబ్‌తో రుద్దుకుంటే సరిపోతుంది. రోజూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దద్దుర్లు వచ్చిన చోట ఐస్‌క్యూబ్‌తో మసాజ్‌ చేసుకుంటే కొన్ని రోజులకు ర్యాష్‌ పోతుంది.

అలాగే ముఖం, చేతులపై ర్యాష్‌ ఉన్నట్లయితే బకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్‌ ముక్కలు వేసుకొని ఆ నీటితో ముఖాన్ని, చేతుల్ని తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ఆపై గంధం ప్యాక్‌ వేసుకోవచ్చు. ఇందుకోసం గంధం అరగదీసి నేరుగా మచ్చలున్న చోట అప్లై చేసుకోవాలి. లేదంటే గంధంలో రోజ్‌వాటర్ వేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. (అయితే ఇందులో పాలు ఉపయోగించకూడదు. ఎందుకంటే పాలలో జిడ్డుదనం ఎక్కువగా ఉంటుంది.) ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు.. ఇలా ర్యాష్‌ ఉన్న భాగాల్లో పూతలా వేసుకొని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకోసారి పదిహేను రోజుల పాటు చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

అయితే ఇది కేవలం ఇంటి చిట్కా మాత్రమే. సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే అశ్రద్ధ చేయకుండా చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని