పోషకాల రాజ్మా!

కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్‌ గింజల్నే రాజ్మాగా పిలుస్తాం. చిక్కుడు జాతికి చెందిన వీటిల్లో పోషకాలు ఎక్కువే.  అవేంటో తెలుసుకుందామా!

Published : 02 Jan 2023 00:34 IST

కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్‌ గింజల్నే రాజ్మాగా పిలుస్తాం. చిక్కుడు జాతికి చెందిన వీటిల్లో పోషకాలు ఎక్కువే.  అవేంటో తెలుసుకుందామా!

* ఈ గింజల్లో శాచురేటెడ్‌ కొవ్వులు తక్కువగా ఉండడం, తగినంత ఫైబర్‌, ప్రొటీన్‌, ఫొలేట్‌, ఐరన్‌ ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజ్మాల్లో ఉండే ఐరన్‌, మాంగనీస్‌, ఫొలేట్‌, ఫాస్ఫరస్‌, థయామిన్‌ వంటివన్నీ ఒంటికి మేలు చేసే పోషకాలే. అలాగే వీటిలో అనేక బయోయాక్టివ్‌ మిశ్రమాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇవన్నీ మనల్ని చురుగ్గా ఉంచుతాయి. జీవక్రియారేటు మెరుగుపడేలా చేస్తాయి.

* ప్రొటీన్‌ తీసుకోవాలంటే... మనం ఎక్కువగా మాంసాహారంపైనే ఆధారపడుతుంటాం. అయితే ఈ తరహా మాంసంలో కొలెస్ట్రాల్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది గుండెకు చేటు చేస్తుంది. కానీ, ఈ రాజ్మా గింజల్లో  కొలెస్ట్రాల్‌ గానీ, అనారోగ్యకరమైన కొవ్వులు గానీ ఉండవు. పైగా వీటి నుంచి అందే ఫైబర్‌,  ప్రొటీన్‌లు గుండెకు మేలు చేస్తాయి.

*  కిడ్నీ బీన్స్‌... తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ పీచూ కలిగిన ఆహారం కావడంవల్ల బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్‌గా ఎంచుకోవచ్చు. పైగా ఇది గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఉత్పత్తి కావడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులూ తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్