మీ నాన్నతో మీ అనుబంధం.. మీ ఉన్నతిలో ఆయన పాత్ర.. నాన్నలో మీకు బాగా నచ్చిన అంశాలు.. పంచుకోండి!

Updated : 17 Jun 2024 14:24 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

My father has taught me a lot; some things are good to follow, and some are bad to avoid. Good thing: never hoard anyone's money, assistance, or support for yourself; always return it to them properly; always set goals for yourself and put up great effort to attain them; and never lose up hope under any circumstances. Honour your life partner and make every effort to help them through all of life challenges. Observe each persons discretion, provide an explanation, and let the others handle things on their own. In whatever manner you can, assist someone who is in need.
Hari Marri
My father is my role model and a guide in my life to reach this position. I will never forget his love and affection even he is no more today.
Sita
నాన్న.. స్ఫూర్తికి పర్యాయ పదం. తను ముళ్ల బాటలో నడిచి బిడ్డలకు పూల బాట వేయగల త్యాగమూర్తి. పున్నమి చంద్రుని వెన్నెల కన్నా నాన్న తన కళ్లతో బిడ్డలపై కురిపించే అనురాగమే మిన్న. ప్రేమను తన గుండె లోతుల్లో దాచినా.. బాధను తన పంటి బిగువున అదిమి పట్టినా.. తన చల్లని చేతులతో పిల్లలకు విశాల ప్రపంచాన్ని పరిచయం చేయగల ధైర్యశాలి నాన్న మాత్రమే... ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా చేయి పట్టి నడిపించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన నాన్న మాకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడు. Love You Naanna..
Y Nagamani
మాది రైతు కుటుంబం. నాన్న అందరికంటే చిన్నవాడు కావడంతో పొలం పనులు అన్నీ నాన్నే చూసుకునేవారు. అక్కడ నాన్న లేకపోతే ఒక్క పని జరగదు. దున్నడం నుంచి నాట్లు వేసే దాకా తీరిక ఉండదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఒంటి నొప్పులతో బాధపడేవారు. అప్పుడు నాన్నను చూస్తే జాలేసేది. ఎందుకంటే రాత్రి, పగలు, ఎండ, వాన తేడా లేకుండా కష్టపడతారు. మేము అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు కింద పడినా ఊరుకునేవారుకాదు. ‘మీకు అన్నం విలువ తెలియదు.. ఆ అన్నం లేక ఎంతోమంది అల్లాడుతుంటారు’ అని చెబుతుంటారు. అన్ని విషయాల్లో మా నాన్నే నాకు స్ఫూర్తి. నేను బాగా చదువుకుని మా నాన్నని మంచిగా చూసుకోవాలనేది నా కోరిక. లవ్ యూ నాన్న.
గీత
I like some superior qualities from my father. Basically he is very simple and down to earth person. He always wants to serve the society and help the deprived people. I learnt these from my father and I have a quality that which I kept away the luxury is learnt from my father. He always support me and my goals.
Lolugu Vijaya Lakshmi
నాన్న లేని వాళ్లకి ఆ పిలుపు ఎంతో అపురూపం. నాన్న తోడుగా ఉంటే ఏ ఆడపిల్లకైనా కొండంత ధైర్యం. కానీ మా ముగ్గురి అక్కచెల్లెళ్లకి ఆ అదృష్టం లేదు. నాన్న నా పదో ఏట చనిపోయారు. ఉమ్మడి కుటుంబంలో నాన్నది ప్రత్యేకమైన స్థానం. తన అన్న పిల్లలని, అక్క పిల్లలని సొంత పిల్లల్లాగే చూసుకొనేవారు. వాళ్ల చదువులు, పెళ్లిళ్ల విషయంలో తనదే తుది నిర్ణయం. నాన్నంటే అందరికీ చాలా భయం. నాకు భయంతో పాటు ప్రేమ కూడా ఉండేది. నాన్నకి దేవుడంటే అపారమైన భక్తి. పొద్దున్న, సాయంత్రం సంధ్యావందనం, పూజ ముగించకుండా పచ్చి గంగ కూడా ముట్టేవారు కాదు. దైవచింతనకి, ధ్యానానికి ఎన్ని గంటలైనా వెచ్చించే వారు. అందరూ నాన్న చాలా గొప్ప మనిషి అని, ఎంతోమందికి సహాయం చేశారని చెబుతూ ఉంటారు. తన స్నేహితుడికి కులాంతర వివాహంలో సహాయం చేశారు. కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు. మిత్రులందరితో మంచి అనుబంధం ఉండేది. తన పిల్లలుగా మాకు కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఆయన గుణగణాలు మాకు కూడా కొద్దో గొప్పో వచ్చాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు. నాన్న పోయాక అమ్మ మొండి ధైర్యంతో బతుకుతోంది. మా పెళ్లిళ్ల తర్వాత తను మరీ ఒంటరైంది. తనకు ఒక తోడు లేకపోవడం నన్ను కలచి వేస్తూనే ఉంటుంది. మరో జన్మంటూ ఉంటే మా అమ్మనే పెళ్లి చేసుకొని తనకు జీవితాంతం తోడుగా ఉండు నాన్నా..! నీ హరి.
హరిణి
మా నాన్న ఒక్క రోజు కూడా రెస్ట్‌ తీసుకోకుండా పని చేస్తుంటాడు. అదే నాకు కూడా అలవాటు అయ్యింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒక్క మాటలో చెప్పలేం. రోజూ సైకిల్‌ మీద స్కూల్‌ దగ్గర దింపడం నేను ఎప్పటికీ మర్చిపోను.
శ్రావణి
నాన్న అనే పదంలోనే ప్రేమ, బాధ్యత కలిసి ఉంటాయేమో.. మా నాన్న శ్రమ జీవి. సమయానికి విలువిచ్చే వ్యక్తి. తన జీవితమంతా పిల్లల కోసం ధారపోశారు. తాను ఎప్పుడూ ఎవరినీ గేలి చేయలేదు. తక్కువగా చూసిందీ లేదు. తప్పు చేసిన వారిని మాత్రం తీవ్రంగా ద్వేషించేవారు. గొప్పలకు పోయి ఎక్కువ చూపించుకునే వారు కాదు. నాన్నగారు చదువుకోకపోయినా ఇన్ని మంచి లక్షణాలను అలవరచుకున్నారు. అలా మా నాన్న గారు మాకు ఆదర్శం. నేను కూడా నాన్నలాగే మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటున్నా..
Sriveni
Evari lifelo aina nanne oka hero. Enno baruvulni mosthu navvadaniki prayathninche vyakthi nana. na varaku naku ma nanne na hero ayane na diamond & na modati snehithudu. Infact enthamandhi fathers thama pillala alochanalni & aasayalani gouravistharo naku teliyadu but ma nana nenu chepthe chinnapilladila vintadu, but neney koppaduthuntanu appudappudu aina emanadu. but still ma nanante bhayam.
Izack lucky
My dad is always inspiring me in my life. He has strived a lot to bring us to what we are today. Myself and my brother are software engineers now. Its only because of my fathers hard work and determination that lifted our lifestyle. He is a lorry driver and still he dedicated his entire life to us and our education. He sacrificed a lot his health, his basic needs everything. Always love him.
Swathi
Nanna ante naku pranam. ma nanna gari peru gurram Venkateswara Rao. aayana naku oka manchi thandri mathrame kadu na guruvu, na dhairyam, na nestham. ma nanna mammalni chala baga penchi chadivincharu. ma istayistalu artham chesukuni, nijayithiga jeevinchadam nerpincharu. oka thandri ga anni badhyathalu poorthi chesi e madhayane e lokaanni vadili vellipovadam ma duradrustam. miss you forever nanna.
Anitha Gurram
అరచేతుల్లో అపురూపంగా పెరుగుతూ.. ఆరు ఋతువుల, ఏడు రంగుల ఇంద్రధనుస్సు చూస్తూ.. ప్రపంచం అందమైందని, నీ మనసులా అందరూ కల్మషం లేని వారు ఉంటారని అనుకున్నాను. కానీ, ఒక్కసారిగా చేయి జారిన గాజు బొమ్మలా.. నీవు దూరమైన ఆ రోజు ఈ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోయాను. రోజులు గడిచే కొద్ది ముందులా ఏదీ ఉండదని తెలుసుకున్నాను. మధ్యతరగతి కుటుంబంలో రెండో ఆడపిల్లని అయినప్పటికీ నా చదువు కోసం మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఎప్పటికీ మర్చిపోలేను నాన్న. మీరు దూరమై, అదే సమయంలో కొవిడ్‌ కారణంగా ప్రజలు పడుతున్న బాధని చూస్తూ ఉండలేకపోయాను. మీ స్ఫూర్తితో నా వంతు సహాయం చేయాలనుకున్నాను. మీ చేయూతతో MBBS పూర్తి చేసిన నేను మీరు లేని బాధను దిగమింగుకుంటూ Covid Warriorగా నా వంతు సేవలందించాను. Discharge అయ్యి వెళ్లే ప్రతి ఒక్కరిలో మీ ఆనందాన్ని చూడగలిగాను. మీ పేరు(సదానందం)లోని ఆనందాన్ని మీ కూతురిగా నా చుట్టూ ఉన్న వారికి నా సేవల ద్వారా అందిస్తున్నాను నాన్న. "HAPPY FATHER'S DAY DAD"
సంబారి సృజన
Nanna ante dhairyam. Prapanchamlo oka ammayiki first hero nanna. Maa nanna ante Naku chala istam. Memu middle class family but nanna matram mammalni entho premaga chuse vaadu. Memu mugguram.. sister, brother, ammanu entho Prema ga chsukunevadu. Kani bhagavanthudu maa happyness nu ekkuvakalam dhakkanivvaledu. Nanna chettu pai nundi kindha paddadu. Maa ardhika sthithi ki minchi karchu pettinam. ayina nanna nadvadam ledhu nanna kindha paddappudu thammudu 6th class. 11 years nunchi nanna manchanike parimitham ayyadu. Amma nannanu pranamla chusukuntundhi. Maa mugguriki pelli ayinayi. Nanna padina kuda Kalla mundhu kanpinche choice ichhina dhevudiki eppatiki thanks cheppukuntunnam. Nanna ante eppatiki Naku apurupame nannaku nenu apurupame.
Chaithanya
నాన్నతో నా అనుబంధం మాటల్లో చెప్పలేనిది. నా ప్రతి అడుగులో, విజయంలో, ఉన్నతిలో ఆయనే ఉన్నారు. నాకు నాన్న అంటే ఎంతో ఇష్టం! ఆయన కేరింగ్ అలా ఉండేది .. అమ్మ,నాన్న రెండూ తానే అయ్యేవాడు.. ఆ లాలన, ప్రేమ, బాధ్యత అలా ఉండేవి. ఆయనలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే తను చాలా పాజిటివ్ మైండెడ్. అస్సలు నెగెటివిటీ ఉండదు. శత్రువులో కూడా మంచితనాన్ని చూస్తాడు. ఈ రోజుల్లో ఆలా ఉండడం కష్టమే..! కానీ.. నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా చిన్నప్పటి నుండి నాన్న నాకు అమ్మాయిలు బాగా చదువుకోవాలి.. ఉద్యోగాలు చేయాలి.. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి.. ఎవ్వరికీ భయపడొద్దు.. అని చెప్తూ ఉండేవారు .. అలాగే పెంచారు. ఈ రోజు నేను ఉద్యోగం చేస్తూ ఒక స్ట్రాంగ్ వుమన్ గా ఉన్నానంటే దానికి కారణం మా నాన్నే! నాన్న ఎప్పటికీ తీరని రుణం!
JANAKI
I love my dad.. My daddy is my favorite hero!
S swarnakumarisingarapu
Ma nanna Kastam nammukunna vyakthi. Ite money daggara matho chala strict ga unde varu. Chaduvuki tappa adambaralaku karchu pette vadu kadu, mammalni petta nichevadu kaadu. Aa age lo maku ardam iyyadi kadu enduku ala chesthunnadani. Sometimes kopam kuda vachedi. Naku job vachinapudu maa nanna hapiness ippatiki marichipolenu. tarvatha Naku chala katnam ichhi manchi sambandam chusi pelli chesadu. Appudu ardamaindi chinnappatinundi enduku prati rupee jagrattaga karchu pettaru ani. when we thought everything is cool going my mother was attached by paralysis. Very shocking to our family, she lost her voice and right hand. Its been past three years of paralysis had taken care of her with out any anger. he is still doing everything for her. like a kid he is taking care of her.. chinnapudu ma Nanna ante koncham bayam undedi. While growing up I loved him, inspired by his decisions, inspired by his hardwork, dedication. Never felt jealous of anybody around him. he never buy things for himself like good clothes, cheppals, gold any luxury thing for him. very selfless person. Always earns for his family not for him. In every step he didn't do anything for him. Ade Naku chaala badhaga untundi. eppudu tana chuttu unna valla kosam kasta padadam tappa thana santosham kosam edi chesukoledhani. Even my mother is very blessed for having him as husband, who never scolded her. Love You Nanna.
Vasantha Yakkala
HI, This is Devi Prathyusha. I am from Achanta, I want to tell few words about my father and father in law "I want to take a moment to express my deep appreciation for the incredible support both my father and father-in-law have given me throughout my life. Their unwavering guidance, encouragement, and love have been invaluable to me in more ways than I can express. Whether it's offering wisdom, lending a helping hand, or simply being there to listen, they have consistently shown me what it means to be supported and loved unconditionally. I am truly blessed to have them both in my life, and I will always cherish the role they play in shaping who I am today."
Devi Prathyusha
Happy father's day to my super hero. You are the one who always supports me and makes me happy. I love your concern and love for me. You're the real hero of my life. You are the only one person who always follows us in hard situations. We thank you Dad, for supporting us in all hard situations. I love you, Nanna.
K. Spoorthy
Father role is the most beautiful role in girl life and also for me. My dad is my well-wisher, he is my support, and he is my first teacher. He shows endless love for me. I am lucky to be his daughter.
Indu
నాన్న అంటే నా దృష్టిలో దేవుని మరో రూపం. మా నాన్న చిన్నప్పుడు నన్ను దండిస్తుంటే చాలా కోపంగా ఉండేది. ఎప్పుడూ ఆంక్షలు పెడుతుంటే బాధపడేదాన్ని. ఎక్కడికీ వెళ్లనివ్వట్లేదని ఈసడించుకునేదాన్ని. కానీ, నాన్న ఎప్పుడూ మా మంచినే కోరేవారు. మమ్మల్ని చదివించడానికి ఎన్ని కష్టాలు పడినా అవి మాకు ఎప్పుడూ తెలియనివ్వలేదు. మా మంచి కోసమే అంత కటువుగా ఉన్నారని నా పెళ్లి తర్వాత తెలిసింది. మాకోసం ఎంత కష్టపడ్డారో అర్థమైంది. నాన్న నిజంగా నా మొదటి హీరో.
లావణ్య
Happy father's day to all and special father's day to my lovely dad. This story was begun from the bottom of my heart because I know what my father is. In all critical situations, he used to be protect us like a strong shield. And also in our studies, he will approach us with a good heart and an encouraging smile. He never ever discouraged us and never ever objected to us in our studies or in our work. We are a little family with more happiness. I LOVE U NANA. Dad, you are so gentle and unique. We are always there for you to fulfill your dreams and hopes on us and we never make you hard to feel. And we are so proud to be say daughters of (K. VENU) and you never compare us with anyone. We love you, dad. This was written by your sweet daughter, K. Sanjana
K. Sanjana
MY DAD IS LIGHT OF MY LIFE. MA NANNA OKA GOVT EMPLOYEE. MA FATHER THO JARIGINA OKA CHINNA INCIDENT NI IPPUDU MEETHO SHARE CHESUKUNTA. NAAKU OKA ROJU HEALTH ISSUE VACHINDHI. VUPIRI SARIGA ANDHADAM LEDHU APPUDU. MA NANNA KI BANDI KUDA LEDHU. CHALA MID NIGHT.. NANNU ETTHUKUNI ROAD MEEDHA PARIGETHUKUNTA HOSPITAL KI THISUKELLARU NA PRANALU EKKADA POTHAYO ANI. A ROJU MA NANNA KALLALO VACHINA NEELU EPPATIKI MARICHIPO LENU. MA NANNA KI EDAVADAM ANTE EMITO THELIDHU. VALLA MOTHER CHANIPOINAPPUDU KUDA MA FATHER ENTHO DHAIRYMGA VUNNARU. MA NANNA EPPUDU MOUNAM GA VUNTARU. KAANI A ROJU NA KOSAM EDAVADAM CHUSA MA NANNA EMOTIONAL CHUSA.
L SOWJANYA
My father is my hero always. I am proud to be a former daughter. He sacrificed all his dreams for my education. I am the 1st female MCA student and software professional from my village. He encourages me always and he never cares about relatives words (why to study a girl). Now I am working as a manager in a Reputed MNC, it is all his motivation to words my goals. All his encouragement made me National Player in KHO-KHO, State Player in Kabaddi and Best IT Employee award. Nanna you are the best dad in the world. Thank you for everything.
Chennamma
Hi, I am Lavanya daughter of Somaiah and Kalavati. We reside in Hyderabad. We are three siblings, including me. So much to say about our parents, who always stood by us to build our careers beyond their limitations. I always feel grateful for their support and love at all stages of our lives. As a daughter, he allowed me to pursue my dual post-graduation. Thank you, dad for everything. Love you.
Lavanya P
మా అప్ప పేరు శంకరయ్య. నాకు ఎనిమిదేళ్ల వయసులోనే మా అప్ప చనిపోయారు. మాతో ఉన్నది తక్కువ రోజులే కానీ, నా జీవితం మొత్తం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఉన్నాయి.. రాత్రి ఎంత లేటైనా మాకు అన్నం తినిపించి, ఆయన తినేవారు. ఇంకా, చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్! నన్ను బాగా చదివించాలి అనుకున్నారు కానీ, ఆ కల తీరకుండానే చనిపోయారు.. ఇప్పుడు ఎవ్వరి డాడీని చూసినా బాధ కలుగుతుంది. కానీ, నాకు తండ్రిని త్వరగా దూరం చేసిన దేవుడు.. తండ్రి లాంటి భర్తని ఇచ్చారు!
Pallavi k
ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. నేను గెలిచినప్పుడు పది మందితో చెప్పుకొని ఆనందపడే వ్యక్తి నాన్న. ఈ రోజు నేను తినే తిండి, కట్టుకునే దుస్తులు.. అన్నీ నాన్న కష్టార్జితమే. ఆడపిల్లని అయినా ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత నాకే ఇచ్చేవాడు నాన్న. చదువు విషయంలో రాజీపడే వాడు కాదు. మా నాన్న తన స్థాయికి మించి నన్ను చదివించాడు. నా పెళ్లి అంగరంగ వైభవంగా చేశాడు. మంచి భర్తని వెతికి నాకు కానుకగా ఇచ్చాడు. ఎప్పుడూ నా కోసం, తమ్ముడు కోసం కష్టపడుతూనే ఉంటాడు. నిరంతర కృషీవలుడు మా నాన్న. ఏదైనా పని అనుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోడు. ఆర్థికంగా ఎలా నిలద్దొక్కుకోవాలో మా నాన్న నుంచి నేర్చుకోవాలి. ఎవరి తండ్రి వారికి గొప్ప. కానీ, మా నాన్న లాంటి తండ్రి ఎవరికీ ఉండరు. నేను నీకు జన్మజన్మల రుణపడి ఉంటాను నాన్న. నా పిల్లలకి కూడా నువ్వే స్ఫూర్తి నాన్న.
Bhagya lakshmi
Prati okkari jeevithamlo Nanna paatra chala mukyamainadi. Maa Nanna Peru Karunakar. Nenu ma chelli iddaram aadapillalamu. Ma intlo chellini abbai la pencharu ma Nanna. Memu anta rich kaadhu. Kani unadanitho santhrupti karamaina jeevitham ela gadapalo naana nerpincharu. Naku Manchi hand writing nerpincharu ma naana. Correct ga ooha telise lope maku ma naana dooramayyaru. Ma ammaku chala time patindi kolukovadaniki, chinna tanamlone maku Manchi chaduvu nerpincharu chala strict ga undevadu. Chala situations lo pillalu valla father tho happy ga undadam chusi chala badesedi naku, naana unte bagundu kada Ani. Aite naana responsibility kuda ammane teskundi. ammane maku nannai dairyanga mundundi mamalni penchi padavalanu chesi pellillu kuda chesindi. Ma Nanna tho gadipina kshanalu maku gurtunai. Andaru lage naku kuda nanna unte bagundu ani chala sarlu badapadanu. you are great Nanna we are very proud of you. ND WE LOVE YOU A ALOT AND MISS YOU ALOT...... NAANA
Ranjitha
పైకి గంభీరంగా కనిపించే నాన్న మనసులో ఉండే ప్రేమ వెలకట్టలేనిది. ఒక కూతురిగా మా నాన్న గురించి చెప్పాలంటే స్కూల్ ప్రోగ్రెస్ కార్డులో అమ్మ చూడకుండా నాన్నతో సంతకం పెట్టించుకోవడం, ఇంటర్‌లో ‘నీకు నచ్చిన కాలేజీలో చదవుకో’మని నాన్న చెప్పడం.. ఇంకా గుర్తుంది. నా భవిష్యత్తు కోసం నాన్న అలుపెరగకుండా శ్రమించారు. అందరికీ ఇవ్వడమే తప్ప ‘నాకు ఇది కావాలి’ అని అడగరు. ఏదైనా అవసరం గుర్తించి ఇస్తే ‘నేను కొనుక్కోవాలి అనుకున్నా.. నువ్వు తెచ్చేసావా’ అని ఒక చిరునవ్వు చిందించేవారు. అందులో ఏదో తెలియని సంతృప్తి కలుగుతుంది. నాన్న ఒక ఎమోషనల్ పదం.. ఎంత చెప్పిన తక్కువే. Happy Father's Day. Love U Nanna.
కల్పన బొంతు
My father is a hardworking man. He supported me in studies. I am a govt teacher now. This position is because of my father only. I lost my Mom at the age of 7 yrs. I love my father very much! Thank you dad for your blessings! Your role in my life is uncountable!
Jhansi laxmi

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్