ఎన్నో రకాల ప్రేమలు ప్రకృతిలో. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా కలగొచ్చు. మన సమాజం మీద సినిమా ప్రభావం కావచ్చు, ఓ ఇద్దరి మధ్య పుట్టే ఆకర్షణనే ప్రేమ అని భావిస్తాం. అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి చూపులో పుట్టేది ఆకర్షణ, అది సెక్స్ కోసం. దానికి ప్రేమ అనే ఒక మేలి ముసుగు వేస్తారు చాలామంది. కొందరి విషయంలో ప్రేమ వెనక ఏదో ఒక రకమైన స్వార్ధం దాగి ఉంటుంది. అలాగే మరికొందరి విషయంలో ప్రేమ అనేది విపరీతమైన మోహం. కొంతమంది మానసికంగా అందులో చిక్కుకుని మధ్యలో వచ్చే వేరొకరి కోసం అనవసరంగా ఎన్నో విధాలుగా నష్టపోతారు.. జీవితాలనే నాశనం చేసుకుంటారు.
Ram