అందరికీ సాయపడుతున్నా గౌరవం లేదు!

పురుషాధిక్య రంగంలో పనిచేస్తున్నా. నేనిక్కడ అందరితో చాలా బాగుంటాను. ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటాను. అందరికీ పనుల్లో సాయపడతాను. అయినా నాకు తగినంత గౌరవం ఇవ్వరు.

Updated : 25 Jan 2023 01:10 IST

పురుషాధిక్య రంగంలో పనిచేస్తున్నా. నేనిక్కడ అందరితో చాలా బాగుంటాను. ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటాను. అందరికీ పనుల్లో సాయపడతాను. అయినా నాకు తగినంత గౌరవం ఇవ్వరు. నాకు ఇటీవలే వేరే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నన్ను నేను మార్చుకోడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఏం చేయాలో సలహా ఇవ్వండి 

 -  రమ్య, వైజాగ్‌

‘అందరితోనూ చాలా బాగుంటాను’ అన్నారు దానికి అర్థమేమిటి? ప్రస్తుత మీ స్థితికి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఏం మార్చుకోవాలో ఒక అంచనాకు రావచ్చు. మీరు మీ విజయాల గురించి నిరాడంబరంగా ఉంటున్నారా? ప్రతి ఒక్కరి కృషిని గుర్తిస్తున్నారా? సహాయం చేస్తున్నానని అన్నారు... సహోద్యోగులకు సందర్భానుసారం సాయం చేస్తారా లేదా మీకు సిండ్రెల్లా సిండ్రోమ్‌ (చేయాల్సిన పనికన్నా ఎక్కువ చేసి ఇతరుల భారం తగ్గించి, తిరిగి వారు అదే రీతిలో మీకు సాయపడట్లేదని బాధపడటం) ఉందా? వీటన్నింటికీ సమాధానాలు కావాలి. ఈ సందర్భాలన్నింటిలోనూ చివరిది మినహా మిగిలిన లక్షణాలన్నీ మీరు కెరియర్‌లో ముందుకు వెళ్లడానికి ఉపకరిస్తాయి. అలాకాకుంటే మాత్రం మిమ్మల్ని మీరు కచ్చితంగా మార్చుకోవాలి. ఇందుకోసం మగవారిలా మారక్కర్లేదు...కానీ, అదనపు నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇక, మీరు కొత్త ఉద్యోగానికి మారాలనుకోవడం మంచి విషయమే. పురుషాధిక్యత ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగుల ఎంపిక, పదోన్నతులూ, విధుల్లో పక్షపాతం ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్కెట్‌ చేసుకోవటం నేర్చుకోండి. మీ నైపుణ్యాలు, సామర్థ్యాన్ని వ్యక్తపరచండి. దానికి అనుగుణంగా మీ విలువను పెంచుకోండి. కావాలంటే థెరపిస్ట్‌ లేదా కెరియర్‌ కోచ్‌లను సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్