అందుకే మరీ అంత పర్‌ఫెక్షనిజం పనికిరాదట!
మీరు జాబ్‌లో పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారా? పర్‌ఫెక్షనే మీ బలం అని నమ్ముతున్నారా? జాబ్‌లో పరిపూర్ణత కోసం అదనంగా శ్రమిస్తున్నారా?అయితే మీరు చేసే జాబ్‌లో మరీ అంత పర్‌ఫెక్షనిస్టుగా ఉండాలనుకోవడం మంచిది కాదట.. అది మీ వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా నష్టం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
మీరు జాబ్‌లో పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారా? పర్‌ఫెక్షనే మీ బలం అని నమ్ముతున్నారా? జాబ్‌లో పరిపూర్ణత కోసం అదనంగా శ్రమిస్తున్నారా?అయితే మీరు చేసే జాబ్‌లో మరీ అంత పర్‌ఫెక్షనిస్టుగా ఉండాలనుకోవడం మంచిది కాదట.. అది మీ వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా నష్టం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఆ వివరాలేంటో చూద్దాం..
నిజానికి పర్‌ఫెక్షనిస్టుగా ఉండాలనుకోవడం సానుకూలాంశమే. అలాంటి వారు తమకు అప్పజెప్పిన పనిని నూటికి నూరు శాతం పర్‌ఫెక్ట్‌గా చేయాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారట. వీరు ఇతరులతో పోలిస్తే స్వీయ ప్రేరణ, ఉత్సాహం అధికంగా కలిగి ఉంటారని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
అదే అసలు సమస్య!
కానీ.. ఈ పరిపూర్ణవాదులు తమకు అప్పజెప్పిన పనిని పర్‌ఫెక్ట్‌గా చేయడానికి, ఇతరులు వేలెత్తి చూపలేనంతగా ఉన్నత ప్రమాణాలేర్పరుచుకొని కఠినంగా శ్రమిస్తారు. పర్‌ఫెక్ట్‌గా చేయడానికి వీరు ఎప్పుడూ పూర్తిగా పనిలో లీనమవ్వడం వల్ల ఒత్తిడికి లోనవుతారట. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. పరిపూర్ణవాదులు తాము సాధించిన విజయాలను ఆస్వాదించలేరని.. ఎప్పుడూ తాము పూర్తి చేయని లక్ష్యాల గురించే ఆలోచిస్తారని.. అదే అసలు సమస్య అని నిపుణులు చెబుతున్నారు.
ప్రతికూల ప్రభావం..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగుల వృత్తిపరమైన విజయంపై వారి పర్‌ఫెక్షనిజం పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఉద్యోగులకు, వారు పని చేస్తున్న సంస్థకు పరిపూర్ణతావాదం వల్ల కొంతవరకు లాభం చేకూరినా అంతిమంగా ఉద్యోగుల మానసిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావమే ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
ఏ పనైనా సరే పర్‌ఫెక్ట్‌గా చేయాలని భావించే వాళ్లలో మీరూ ఒకరైతే ఓ మాట గుర్తుంచుకోండి. ఒత్తిడికి లోను కాకుండా పని పూర్తి చేయడం నేర్చుకున్నప్పుడే మీరు 'మిస్ పర్‌ఫెక్ట్' అవుతారు. కార్పొరేట్ రంగంలో పైకి ఎదగడానికి కష్టపడి పని చేయడం, స్కిల్స్ పెంచుకోవడం మంచిదే. కానీ మీరు మానసికంగా, శారీరకంగా అనారోగ్యం బారిన పడేంత కాదు. తస్మాత్ జాగ్రత్త!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.