ఏడో నెల.. పొత్తి కడుపులో నొప్పి.. తగ్గేదెలా?

హలో డాక్టర్.. నాకు 38 ఏళ్లు. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిని. పొట్ట కింది భాగంలో నొప్పి వస్తోంది.. పడుకొని పక్కలకు తిరిగినప్పుడు చాలా నొప్పిగా ఉంటోంది. ఇది నాకు మొదటి ప్రెగ్నెన్సీ. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో సలహా.....

Published : 15 Sep 2022 21:01 IST

హలో డాక్టర్.. నాకు 38 ఏళ్లు. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిని. పొట్ట కింది భాగంలో నొప్పి వస్తోంది.. పడుకొని పక్కలకు తిరిగినప్పుడు చాలా నొప్పిగా ఉంటోంది. ఇది నాకు మొదటి ప్రెగ్నెన్సీ. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం సమయంలో ఎముకల మధ్య ఎడం కొద్దిగా ఎక్కువై.. ఆ ప్రభావం కండరాలు, లిగమెంట్లు, నరాల మీద పడి.. పడుకున్నప్పుడు, పక్కలకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ నొప్పి ముఖ్యంగా పొత్తి కడుపు కింద భాగంలో ఉన్న ప్యూబిక్‌ ఎముకల వద్ద వస్తుంది. దీనికి ఒకసారి పరీక్షించి చూడాలి. ఒకవేళ ఎముకల మధ్య జాయింట్‌లో ఎడం కనుక ఎక్కువైతే దానికి ప్రత్యేకమైన చికిత్సలుంటాయి. ఆర్థోపెడిక్‌ సర్జన్‌ని సంప్రదిస్తే తగిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తారు. దాంతో కూడా సమస్య తగ్గకపోతే ఒక్కోసారి దూరమైన ఎముకల్ని దగ్గరికి చేర్చడానికి ప్రత్యేక పద్ధతిలో చికిత్స చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని