నొప్పులు తగ్గించే అల్లం టీ

టీ కడుపులో పడందే చాలామందికి రోజు గడవదు. అయితే, సాధారణ టీకి బదులు రోజుకోసారి అల్లం ఛాయ్‌ తాగి చూడండి. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటారు ఆయుర్వేద నిపుణులు.

Updated : 08 Jul 2024 07:55 IST

టీ కడుపులో పడందే చాలామందికి రోజు గడవదు. అయితే, సాధారణ టీకి బదులు రోజుకోసారి అల్లం ఛాయ్‌ తాగి చూడండి. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటారు ఆయుర్వేద నిపుణులు. అవేంటంటే...

  • దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాంతి అయిన భావన కలుగుతుంది. దీన్ని నివారించడానికి ఓ కప్పు అల్లం ఛాయ్‌ తాగేయండి. ఇది జీర్ణ ప్రక్రియ వేగాన్ని పెంచుతుంది. నొప్పులకూ నివారిణిగా పనిచేస్తుంది.
  • చినుకులతో వాతావరణం చల్లబడేసరికి... అందరినీ దగ్గూ, జలుబూ వేధిస్తున్నాయి. ఇవి తగ్గాలంటే  అల్లం ఛాయ్‌ చప్పరించండి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. తద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. అల్లం టీ తరచూ తాగితే.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి దరిచేరవు.  
  • అల్లంలోని జింజెరాల్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. ఆర్థరైటిస్, కండరాల నొప్పులతో పాటు నెలసరి ఇబ్బందులనూ తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి భావనలను దూరం చేస్తుంది.
  • రోజూ ఓ కప్పు అల్లం టీ తాగితే.. క్రమంగా అధిక బరువూ అదుపులో ఉంటుంది.. ఇందులోని పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి గుండె సమస్యల్ని రానివ్వవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్