PDA Rules: నలుగురిలో ముద్దూముచ్చట్లు.. హద్దుల్లో ఉంటేనే మురిపెం!
‘మెట్రో రైల్లో ప్రేమ జంట ముద్దులాట’, ‘షాపింగ్ మాల్‌లో భార్యాభర్తల రొమాన్స్’, ‘బైక్‌పై కాలేజీ విద్యార్థుల వికృత చేష్టలు’.. ఈ మధ్య ఇలాంటి వార్తలు ఎక్కువగా చూస్తున్నాం.. వింటున్నాం. నిజానికి ఇలాంటివి చూసినప్పుడల్లా.. ‘హవ్వ.. నలుగురిలో ఇదేం పాడు పని’ అని ముక్కున వేలేసుకుంటాం.. ఒకింత అసౌకర్యానికి....
‘మెట్రో రైల్లో ప్రేమ జంట ముద్దులాట’, ‘షాపింగ్ మాల్‌లో భార్యాభర్తల రొమాన్స్’, ‘బైక్‌పై కాలేజీ విద్యార్థుల వికృత చేష్టలు’.. ఈ మధ్య ఇలాంటి వార్తలు ఎక్కువగా చూస్తున్నాం.. వింటున్నాం. నిజానికి ఇలాంటివి చూసినప్పుడల్లా.. ‘హవ్వ.. నలుగురిలో ఇదేం పాడు పని’ అని ముక్కున వేలేసుకుంటాం.. ఒకింత అసౌకర్యానికి గురవుతాం. దీన్నే PDA (పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్) అంటారు. అంటే.. జంట తమ సాన్నిహిత్యాన్ని, శారీరక భావోద్వేగాల్ని నాలుగ్గోడలు దాటి నలుగురిలోనూ ప్రదర్శించడమన్నమాట! అయితే ఈ క్రమంలో చాలామంది ‘ఎవరేమనుకుంటే మాకెందుకు? మా పనేదో మాది!’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ ఏదైనా ‘హద్దుల్లో ఉంటేనే ముద్ద’న్నట్లు.. నలుగురిలో సరసానికైనా, విరహానికైనా.. జంటలు కొన్ని పరిమితులు పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇలాంటి చేతలు..!
కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు, ప్రేమికులు, చదువుకునే అమ్మాయి-అబ్బాయి.. ఇలాంటి కొన్ని యువ జంటలు.. ఒకరి భుజాలపై మరొకరు చేయి వేసి హత్తుకోవడం, ముద్దాడడం, చెట్టపట్టాలేసుకొని నడవడం, చేతులు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఇలా నలుగురిలో తమ సాన్నిహిత్యాన్ని, శారీరక భావోద్వేగాల్ని ప్రదర్శించడాన్నే PDA (పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్)గా పిలుస్తున్నారు నిపుణులు. నిజానికి ఇదీ పాశ్చాత్య సంస్కృతే.. అయినా ప్రస్తుతం మన దేశంలోనూ కామనైపోయింది. అయితే ఈ క్రమంలో కొంతమంది తాము నలుగురిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తే.. మరికొందరేమో అక్కడున్న వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి కావాలనే ఇలా చేస్తుంటారు. ఏదేమైనా ఇలాంటి చేష్టలు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, తాము అసౌకర్యానికి గురవకుండా ఉండాలంటున్నారు నిపుణులు.
శ్రుతి మించద్దు!
దాంపత్య బంధాన్ని దృఢం చేసుకోవాలంటే దంపతులిద్దరి మధ్య సాన్నిహిత్యం, రొమాన్స్, శృంగారం.. ఇవన్నీ కీలకమే! అయితే ఇవి నాలుగ్గోడల మధ్య ఉన్నప్పుడే గౌరవప్రదంగా ఉంటుంది.. అదే హద్దు దాటి నలుగురిలో ప్రదర్శిస్తే.. ఇటు ఇలా చేసేవారు నవ్వులపాలు కావడం, అటు ఇతరులు అసౌకర్యానికి గురికావడం.. వంటివి జరుగుతాయి. అలాగని జంటలకు తమ ప్రేమను నలుగురిలో ప్రదర్శించే స్వేచ్ఛ కూడా లేదా? అంటే.. అదీ హద్దుల్లో ఉన్నంతవరకే అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ప్రేమగా మణికట్టుపై/నుదుటిపై ఓ ముద్దు పెట్టడం, సుతారంగా గుండెలకు హత్తుకోవడం, చేతిలో చెయ్యేసి నడవడం.. ఇలాంటివి చేసినా, చూసినా అంతగా ఇబ్బంది అనిపించదు.. అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీ కపుల్ చేసే ఇలాంటి పనులు చూసి ‘ఎంత ముచ్చటైన జంటో’ అనుకోవడం కూడా సహజమే! కాబట్టి భాగస్వామితో ఇలా ప్రేమగా వ్యవహరించే తీరు కూడా నలుగురిలో పాజిటివిటీ నింపేలా ఉండాలే తప్ప.. వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదంటున్నారు నిపుణులు. కాబట్టి జంటలు నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇంతకుమించిన చేష్టలు ప్రదర్శించకుండా తమ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవాలంటున్నారు.
ఇవీ గుర్తుంచుకోవాలి!
నలుగురిలోకి వెళ్లినప్పుడు జంటలు తమ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవడమే కాదు.. మరిన్ని విషయాలూ దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.
⚛ పిల్లలు ప్రతి విషయానికి ఇట్టే ప్రభావితులవుతారు. కళ్లతో చూసింది, చెవులతో విన్నదే నిజమని నమ్ముతారు. అలాంటి వాళ్ల ముందు ఇలాంటి చేష్టలు ప్రదర్శిస్తే.. వాళ్ల మనసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లేనిపోని ఆలోచనలు వారిలో రేకెత్తించినవారవుతారు. కాబట్టి దంపతులైనా, ప్రేమ జంటలైనా.. తమ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది.
⚛ ఇతరులతో పోల్చుకోవడం, వాళ్ల కంటే ఓ మెట్టు పైనే ఉండాలనుకోవడం కొంతమందికి అలవాటు. పీడీఏ విషయంలోనూ కొంతమంది ఇలాగే వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో ఎమోషన్స్ హద్దు దాటితే చూసే వాళ్లకూ విసుగొస్తుంది. రోత పుడుతుంది. అలా జరగకూడదంటే నలుగురిలో ప్రేమను సున్నితంగా, మర్యాదపూర్వకంగా ప్రదర్శించాలి.
⚛ ఒక్కోసారి జంటలతో వాళ్ల స్నేహితులు కూడా వెంట వెళ్తుంటారు. ఇలాంటప్పుడు కొంతమంది టేబుల్ కింద చేతులు, కాళ్లతో సరసాలాడడం.. వంటివి చేస్తుంటారు. నిజానికి దీనివల్ల ఇలా చేసే జంటలకేమీ అనిపించకపోవచ్చు. కానీ వారి వెంట వెళ్లిన వారు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటప్పుడూ ఎమోషన్స్‌ని హద్దు దాటకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
⚛ మీ భాగస్వామి నలుగురిలో ఇలా మీతో రొమాన్స్ చేయడం మీకు నచ్చకపోవచ్చు. అలాగని మీరు అసౌకర్యానికి గురవుతూ వాళ్ల ప్రవర్తనను ఆమోదించాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. తద్వారా మీకే కాదు.. చూసేవాళ్లకూ ఇబ్బందిగానే ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
⚛ కొంతమంది ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తే.. మరికొందరు తమ మధ్య ఉన్న ప్రేమను చూపించుకోవడం కోసం కావాలనే ఇలా చేస్తుంటారు. అదే తగదంటున్నారు నిపుణులు. ఏదో గొప్పలకు పోయి ఇలాంటి పనులు చేస్తే.. నలుగురిలో నవ్వులపాలు కావడం, వేధింపులకు గురవడం.. వంటి చేదు అనుభవాలూ ఎదురవ్వచ్చంటున్నారు.
⚛ రొమాంటిక్‌గా ఉండే జంటలకు తరచూ అలాంటి ఆలోచనలే వస్తుంటాయి. అయితే నలుగురిలో ఉన్నప్పుడు ఆ తరహా టాపిక్స్ నుంచి మనసు మళ్లించి.. జంటలు వేరే విషయాల గురించి చర్చించడం వల్ల వాళ్ల భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- జుట్టు నెరుస్తోంది.. ఏం తినాలి?
- ముంజేతికి.. ముచ్చటగా!
- అలసిన చర్మానికి సాంత్వన ఇలా!
- కళ్లకు.. కొత్త కళ!
- ఆరోగ్యంగా.. వన్నెచిన్నెలు
ఆరోగ్యమస్తు
- అందుకే నేలపై కూర్చొని తినాలట!
- పోషక గనులు.. చిరు ధాన్యాలు!
- దిండు వద్దు...
- కడుపుబ్బరమా? అయితే ఇలా చేయండి!
- కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..
అనుబంధం
- పెళ్లైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటోంది..!
- ఉమ్మడి కుటుంబంలో కలిసేలా..
- ఆ అబ్బాయి వల్ల కాలేజీ మాన్పించారు.. ఏం చేయాలి?
- అతి సౌకర్యాలతో అధిక చింతలు
- Relationship Tips: అది చూసే దృష్టిని బట్టే ఉంటుందట!
యూత్ కార్నర్
- వారమంతా ఉద్యోగం.. వారాంతాల్లో వ్యాపారం!
- Payal Chhabra: దేశం కోసం విదేశీ ఆఫర్లనూ తిరస్కరించింది!
- ప్రపంచ గమనాన్ని మార్చేందుకే నా పర్యటనలు!
- Jayashree : 70 గంటలు విమానం నడిపి..!
- ఆసియా క్రీడల్లో.. తొలి సంతకం!
'స్వీట్' హోం
- ఇలా చేస్తే దోమల బెడద ఉండదు!
- చపాతీ కర్రే.. కాస్త వెరైటీగా!
- టీ, కాఫీ మరకలు పోలేదా..
- తోటపని సులువుగా...
- పూజ వేళ.. ఆకలి వేయకుండా!
వర్క్ & లైఫ్
- పని ప్రదేశంలో వారికే వేధింపులెక్కువట!
- మీకు మీరే రక్ష!
- Women Reservation Bill : 33 శాతానికి.. మూడు దశాబ్దాలు పట్టింది?
- సిబ్బందిలో ప్రేరణ కలిగించాలంటే..!
- ఈ చిట్కాలు పాటిస్తే కుడుములు అదుర్స్!