ప్రొటీన్‌కి పచ్చి బఠాణీ

పులావ్, బిర్యానీ, ఉప్మా, చాట్‌.. ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచినీ, కంటికింపైన రంగునీ ఇస్తుంది బఠాణీ. ఇందులో పోషకాల మోతాదూ ఎక్కువే.

Published : 01 Jul 2024 04:15 IST

పులావ్, బిర్యానీ, ఉప్మా, చాట్‌.. ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచినీ, కంటికింపైన రంగునీ ఇస్తుంది బఠాణీ. ఇందులో పోషకాల మోతాదూ ఎక్కువే. మరి దీని ప్రయోజనాలేంటో తెలుసా?

ఐరన్‌... పచ్చి బఠాణీల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులోని ల్యూటిన్‌ అనే కెరొటినాయిడ్‌ కళ్లలో శుక్లాలు రానివ్వదు. ఇక, ఇందులోని విటమిన్‌ బి6, సి, ఫోలేట్‌ వంటి పోషకాలు చర్మ సంరక్షణకి అవసరమైన కొలాజెన్, ఎలాస్టిన్‌ని అందిస్తాయి.

వీటిల్లో కొవ్వు శాతం తక్కువగా, ప్రొటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి సరైన ఆహారం ఇది. కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. మాంసాహారం తినని వారు ప్రొటీన్‌ కోసం పచ్చి బఠాణీలను ఎంచుకోవచ్చు.

జాగ్రత్తలివి: జీర్ణాశయ ఇబ్బందులు, గ్యాస్, ఎసిడిటీతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. అలానే, ప్రొటీన్‌ కోసమని అధికంగా తీసుకుంటే... కిడ్నీలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్