నట్టింటికి ‘గణపతి’ వెలుగులు!
పండగొస్తుందంటే చాలు.. ఇళ్లంతా శుభ్రం చేస్తాం.. గుమ్మాలకు పచ్చటి తోరణాలు, పూల దండల్ని వేలాడదీస్తాం.. ఇంటి చుట్టూ విద్యుద్దీపాల కాంతులతో హంగులద్దుతాం. అంతేనా.. పండగ ప్రత్యేకతను చాటేలా ఆయా అలంకరణ వస్తువులతో ఇంటికి కొత్త శోభ తీసుకురావడంలో మనది అందె...
పండగొస్తుందంటే చాలు.. ఇల్లంతా శుభ్రం చేస్తాం.. గుమ్మాలకు పచ్చటి తోరణాలు, పూల దండల్ని వేలాడదీస్తాం.. ఇంటి చుట్టూ విద్యుద్దీపాల కాంతులతో హంగులద్దుతాం. అంతేనా.. పండగ ప్రత్యేకతను చాటేలా ఆయా అలంకరణ వస్తువులతో ఇంటికి కొత్త శోభ తీసుకురావడంలో మనది అందె వేసిన చేయి. అందులోనూ మన తెలుగు వారికి పెద్ద పండగైన వినాయక చవితి రోజున గణపతి ప్రతిమతో కూడిన విభిన్న వస్తువులతో ఇంటిని అలంకరించుకొని మురిసిపోతుంటాం. అలాంటి విభిన్న డెకరేటివ్ పీసెస్ ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరాయి.
గణపతి ప్రతిమలతో కూడిన.. ఎల్‌ఈడీ కర్టెన్ స్ట్రింగ్, వాల్ హ్యాంగింగ్స్, గోడకు అమర్చుకునే డెకరేటివ్ పీసెస్, టేబుల్‌పై పెట్టుకునేలా ఉన్న బుజ్జి గణపతి విగ్రహం, ఇంటి ముంగిట్లో అతిథులకు స్వాగతం పలికేందుకు పూలు పేర్చిన గంగాళంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం, కారు/బైక్ కీస్ కోసం రూపొందిన వినాయకుడిని పోలిన కీచెయిన్, మెయిన్ డోర్ దగ్గర పార్వతీ నందనుడి ఫొటోతో కూడిన వెల్‌కమ్ ప్లేట్, గణపతి విగ్రహంతో కూడిన గడియారం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అలంకరణ వస్తువులు ఈ పండక్కి సిద్ధమయ్యాయి. కేవలం బయటి గదుల్లోనే కాదు.. పూజ గదిలో అమర్చుకునేలా లంబోదరుడి విగ్రహంతో కూడిన ప్రమిదలు, మోదక్-ఎలుక ఆకృతిలో ఉన్న ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకుంటే మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. మరి, ఈ వినాయక చవితికి ఇంటి అందాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమైన అలాంటి కొన్ని డెకరేటివ్ పీసెస్‌ని ఇక్కడ చూసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.