గాడిద పాలతో సౌందర్యోత్పత్తులు తయారుచేస్తోంది!
ఆమెకు చదువు పెద్దగా అబ్బలేదు.. అయినా నలుగురిలో ఒకరిగా కాకుండా.. ‘ఒక్క’రిగా నిరూపించుకోవాలనుకుంది. ఈ ఆలోచనతోనే వ్యాపారం చేయాలనుకుంది.. కానీ అందరూ నీ వల్ల కాదని నిరుత్సాహపరిచారు.
(Photo: Instagram)
ఆమెకు చదువు పెద్దగా అబ్బలేదు.. అయినా నలుగురిలో ఒకరిగా కాకుండా.. ‘ఒక్క’రిగా నిరూపించుకోవాలనుకుంది. ఈ ఆలోచనతోనే వ్యాపారం చేయాలనుకుంది.. కానీ అందరూ నీ వల్ల కాదని నిరుత్సాహపరిచారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది.. విజయం సాధించింది.. అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని చెబుతోంది. ఆమే.. దిల్లీకి చెందిన పూజా కౌల్. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేస్తూ డబ్బు సంపాదించడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిలకు అపురూప లావణ్యాన్ని చేరువ చేస్తోంది. ‘ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.. అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు..’ అని చెబుతోన్న పూజ.. తన స్టార్టప్, జీవితంలో తానెదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఇలా చెప్పుకొచ్చింది.
అమ్మాయిలు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే.. ‘అమ్మాయివి.. ఇవన్నీ నీకెందుకు?!’ అని నిరుత్సాహ పరిచేవారే మన చుట్టూ ఎక్కువమంది ఉంటారు. నా విషయంలోనూ ఇదే జరిగింది. చిన్నతనం నుంచీ నాకు చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ నాకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండాలనుకున్నా. పది పాసవడమే గగనమైపోయింది. దానికి తగ్గట్లుగానే నా కుటుంబానికి కూడా నేనేదో సాధిస్తానన్న ఆశలేవీ లేవు. అయినా అవేవీ పట్టించుకోకుండా నా వంతు ప్రయత్నం నేను చేయాలనుకున్నా.
ఆ ఒక్క పదంతో..!
ఎట్టకేలకు బీఏ పూర్తిచేశాక సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేయాలనుకున్నా. కానీ అది నా లక్ష్యం కాదనిపించింది. దాంతో తర్వాత ఏం చేయాలో అర్థం కాక.. విభిన్న అంశాలకు సంబంధించిన ఆర్టికల్స్ చదివేదాన్ని. ఈ క్రమంలోనే ఆంత్రప్రెన్యూర్ అనే పదం నా కంట పడింది. ఇన్నాళ్లూ నేను వెతుకుతోన్న కెరీర్ లక్ష్యం ఇదే అనిపించింది. ఈ ఆలోచనతోనే 2016లో మహారాష్ట్రలోని TISS యూనివర్సిటీ నుంచి సోషల్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్‌లో చేరా. ఇందులో భాగంగానే డైరీ ఇన్నొవేషన్‌పై ఓ ప్రాజెక్ట్ చేశా. అప్పుడే గాడిద పాల గురించి తెలుసుకున్నా. ఆవు పాలు, మేక పాలు పడని చిన్నారులకు ఇవెంతో మేలు చేస్తాయన్న విషయం అర్థం చేసుకున్నా. ఇదే విషయంపై ప్రజెంటేషన్ ఇస్తే అందరూ ఇదొక తెలివి తక్కువ ఆలోచన అంటూ కొట్టిపడేశారు.. నవ్వుతూ నన్ను హేళన చేశారు. దాంతో నా మనసు నొచ్చుకున్నా.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశా.
వచ్చిన ఉద్యోగం వదిలేశా!
గాడిద పాలతో ఇంకా కొత్తగా ఏం చేయచ్చని ఆలోచిస్తోన్న తరుణంలోనే ఈజిప్షియన్ల సౌందర్య రహస్యాలు గుర్తొచ్చాయి. క్లియోపాత్ర తన అందానికి మెరుగులు దిద్దుకునే క్రమంలో గాడిద పాలనే ఉపయోగించిందన్న విషయం మదిలో మెదిలింది. అంతే.. ఆ పాలతో సబ్బులు తయారుచేయడం మొదలుపెట్టా. నా పీజీ పూర్తయ్యే సరికి సుమారు 200 సబ్బులు తయారుచేశా. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చినా.. సౌందర్యోత్పత్తుల వ్యాపారం చేయాలన్న ఆలోచనతో జాబ్‌లో చేరకుండా దిల్లీ వచ్చేశా. బిజినెస్ అయితే చేయాలనుకున్నా.. కానీ అందుకోసం ఒక్క గాడిద కూడా కనిపించేది కాదు. ఈ అన్వేషణలో భాగంగానే ఇక్కడి Donkey Communityలో చేరా. వారికి ఓవైపు ఉపాధి కల్పిస్తూనే.. మరోవైపు ఆ పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేయడం మొదలుపెట్టా. ఈ క్రమంలోనే 2018లో ‘Organiko Beautifying Life’ పేరుతో స్టార్టప్‌ని ప్రారంభించా.
అన్నీ సహజసిద్ధమైనవే!
ఇలా నా బిజినెస్‌ను చూసి చాలామంది ‘ఆడపిల్లవి.. ఇవన్నీ నీకెందుకు?!’ అంటూ నిరుత్సాహపరిచారు.. ఇంకొంతమందైతే.. ‘కొత్త ఊపు ఇలాగే ఉంటుంది.. ముందు ముందు లాభాలు రాకపోతే నీకే తెలుస్తుంది..’ అంటూ దెప్పిపొడిచారు. వారందరికీ నా పనితోనే సమాధానం చెప్పాలనుకున్నా. నెమ్మదిగా నా ఉత్పత్తుల్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ప్రారంభించా. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగా. ఇప్పుడు సబ్బులతో పాటు స్కిన్ ప్రొటెక్షన్ క్రీమ్స్, మాస్కులు.. వంటి అన్ని సౌందర్య ఉత్పత్తులు మా వద్ద తయారవుతున్నాయి. ఇవన్నీ సహజసిద్ధమైనవే! వీటిలో కొన్ని ఆయుర్వేద పదార్థాలు, ఈజిప్ట్‌కు చెందిన సహజసిద్ధమైన పదార్థాల్ని సైతం వాడుతున్నాం. ఇవి అందాన్ని పెంచడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యల్ని సైతం దూరం చేస్తాయి. ప్రస్తుతం వ్యాపార రంగంలో నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నా.
అందరికీ అందాన్ని చేరువ చేయడంతో పాటు అంతరించిపోతున్న ఈ మూగజీవాల్ని (గాడిదల్ని) రక్షించడానికి, ఇవే జీవనాధారంగా బతుకుతోన్న వారికి ఓ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!