వానల్లో.. పెద్దవాళ్ల కోసం!

ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మారుతున్న సీజన్‌కు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకొంటూ పరిరక్షించాలి. వర్షాకాలంలో వారినెలా సంరక్షించాలో చూద్దాం.

Published : 14 Jun 2024 03:57 IST

ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మారుతున్న సీజన్‌కు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకొంటూ పరిరక్షించాలి. వర్షాకాలంలో వారినెలా సంరక్షించాలో చూద్దాం.

  • కాచి చల్లార్చిన లేదా గోరువెచ్చని నీటిని తరచూ తీసుకోవడం అలవాటు చేయాలి. సాధారణంగా వర్షాకాలంలో నీటి ద్వారా కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి అనారోగ్యాలు దరి చేరే ప్రమాదం ఉంది. దీన్ని నిరోధించాలంటే వేడి నీటిని మాత్రమే తాగాలి. స్నానానికి కూడా గోరువెచ్చని నీటిని ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, తడవకుండా రెయిన్‌కోటు వంటి ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్త పడాలి.
  • వ్యాధులెక్కువగా ప్రబలే సీజన్‌ కావడంతో వ్యాధినిరోధక శక్తిని పెంచేలా ఆహారాన్ని అందించాలి. వాతావరణంలో మార్పులు, అతి చల్లదనం, తరచూ చినుకుల్లో తడవడంవల్ల జలుబు, జ్వరం, దగ్గు బాధిస్తాయి. వీటికి దూరంగా ఉంచాలంటే గింజధాన్యాలు, పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. తీపి, నూనె పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. ఇంటి భోజనానికి పెద్దపీట వేసేలా చూడాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సహా పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. త్వరగా అనారోగ్యాలు దరిచేరవు.
  • వీరు విశ్రాంతి తీసుకునే గది, దాని చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి. గదికి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వాటిపై దోమలు పెరిగే ప్రమాదం ఉంది. గదిలో వెలుతురుండేలా చూడాలి. ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంపకం మంచిది. వీరు నిద్రపోయే గది వెచ్చగా ఉంటే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దోమలెక్కువగా ఉండే ప్రాంతమైతే ఈ సీజన్‌లో కిటికీలకు నెట్‌ వేయడం మంచిది. లేదంటే దోమకాటు కూడా తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్