Sweet Home: ఇల్లు మారుతున్నారా?

పిల్లలకు సెలవులు దొరుకుతాయి. కాబట్టి, ఇల్లు మారాలనుకునే వారిలో చాలామంది వేసవిని అనుకూల సమయంగా భావిస్తారు. మీరూ అలాగే ఆలోచిస్తున్నారా? అయితే ఈ సూచనలు మీకోసమే..

Published : 05 May 2023 00:16 IST

పిల్లలకు సెలవులు దొరుకుతాయి. కాబట్టి, ఇల్లు మారాలనుకునే వారిలో చాలామంది వేసవిని అనుకూల సమయంగా భావిస్తారు. మీరూ అలాగే ఆలోచిస్తున్నారా? అయితే ఈ సూచనలు మీకోసమే..

* కొత్త ఇల్లు సర్దేప్పుడు చెత్త భారీగా పోగవడం గమనించే ఉంటారుగా! మోసుకెళ్లడం.. తర్వాత పడేయడం రెండూ శ్రమే! ప్యాకింగ్‌ చేసేప్పుడే అనసరమైనవి, తక్కువగా వాడేవి పక్కన పెట్టేయండి. చివర్లో తీరిగ్గా ఆలోచిస్తే వాటి ఉపయోగం ఎంత వరకనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి పడేయొచ్చు. లేదా ఎవరికైనా ఇచ్చేయొచ్చు.

* ఫ్రిజ్‌లోని వస్తువుల్లో పాడయ్యే వాటిని వీలైతే ముందుగానే వాడేయండి. లేదంటే ఇచ్చేయడమో, తీసేయడమో చేయండి. ఫ్రిజ్‌తోపాటు అవెన్‌నీ ఇక్కడే శుభ్రం చేసుకొని వెళితే.. శ్రమా తగ్గుతుంది. వెళ్లగానే సులువుగా ఉపయోగించుకోవచ్చు.

* పెద్ద పెట్టెల్లో సర్దితే త్వరగా పని అవుతుంది అనిపిస్తుంది కదూ! కానీ మోసే వారికి భారం. తేలిగ్గా ఉన్నవాటిని పెద్దవాటిలో.. బరువున్న వాటిని చిన్న చిన్న వాటిల్లో సర్దేస్తే సరి. అలాగే ప్రతి దానికీ ఓ నంబరు ఇవ్వండి. వేటిలో ఏమున్నాయన్న దాన్ని ఫోనులో లేదా చిన్న పుస్తకంలో రాసి పెట్టుకుంటే తర్వాత వెదుకులాట ఉండదు.

* మారిన రోజే మొత్తం సర్దుకునేంత ఓపిక ఉండదు. భోజనాలు వరకూ బయట నుంచి తెచ్చుకోగలం. విశ్రాంతి తీసుకోవడానికీ, స్నానాలు వగైరా వాటికి అత్యవసరమైనవి కొన్ని ఉంటాయి. వాటికోసం బాక్సులన్నీ తెరుస్తూ కూర్చోలేం. తెరిచినా ఇల్లంతా చిందరవందరగా కనిపిస్తుంది. కాబట్టి ‘అర్జెంట్‌ బాక్స్‌’ని సిద్ధం చేసుకోండి. పేపర్‌ ప్లేట్లు, మార్చుకోవాల్సిన దుస్తులు, పక్కదుప్పట్లు, బ్రష్‌లు, సబ్బులు, స్నాక్స్‌, అత్యవసర వంటసామగ్రి... ఇలా ఆరోజుకు అవసరమయ్యే వాటన్నింటినీ దానిలో పెట్టేసుకుంటే పని సులువవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్