vacation: విహారానికెళ్తున్నారా?
ఎండలు మండిపోతున్నాయి. ఒత్తిడికి దూరంగా.. ఏదైనా చల్లని ప్రదేశంలో ప్రియమైన వారితో కొద్దిరోజులు గడపాలనుందా? పర్యటన ప్రశాంతంగా సాగాలంటే కొన్ని సలహాలు పాటించాలి మరి.
ఎండలు మండిపోతున్నాయి. ఒత్తిడికి దూరంగా.. ఏదైనా చల్లని ప్రదేశంలో ప్రియమైన వారితో కొద్దిరోజులు గడపాలనుందా? పర్యటన ప్రశాంతంగా సాగాలంటే కొన్ని సలహాలు పాటించాలి మరి..
* ఎంచుకున్న ప్రదేశం మీ ఇద్దరికీ నచ్చేదై ఉండాలి. అప్పుడే ఇద్దరూ ఆస్వాదించగలుగుతారు. పచ్చని అడవులు, తీర ప్రాంతాలైతే వేసవిలో సరదాగా ఉంటుంది. చుట్టూ ఆకర్షణీయమైన ప్రదేశాలు, పర్యటక ప్రాంతాల గురించీ ముందే తెలుసుకుంటే ప్లానింగ్ సులువవుతుంది.
* వేసవిలో టూరిజం సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తుంటాయి. వాటిని గమనించుకుంటే నగదు ఆదా అవుతుంది.
* ఆహారం, రవాణావంటి ఇతర సదుపాయాల గురించి చెక్ చేసుకోవాలి. లేకపోతే వెళ్లిన తర్వాత ఇబ్బందులెదురవొచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జంక్‌ఫుడ్ తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
* ఎన్ని రోజులు వెళ్తున్నారో అందుకు కావాల్సిన వస్తువులను జాగ్రత్తగా సర్దిపెట్టుకోవాలి. వేసవి కాబట్టి నూలు దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఒక వేళ వెళ్లిన ప్రాంతంలో చలి ఉంటుందనుకుంటే శాలువా, స్వెటర్లు లాంటి ఉన్ని దుస్తులు కూడా తీసుకెళ్లండి.
* అత్యవసరమైతే వాడుకునేందుకు మందులు వెంట ఉంచుకుంటే మంచిది. లగేజీ మరీ ఎక్కువైనా ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్లేటప్పుడు ఇబ్బంది పడతారు.
* ఛార్జర్లు, పవర్ బ్యాంకులు వంటివి గుర్తు ఉంచుకుని మరీ సిద్ధం చేసుకోండి. గూగుల్ మ్యాప్ వంటివి ఆఫ్‌లైన్‌లో ముందుగానే సేవ్ చేసుకొని ఉంటే.. ఇంటర్నెట్ సమస్యలున్నా ప్రయాణంలో ఇబ్బందులు ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.