ఫ్రిజ్‌లో ఉంచినా సరే.. జాగ్రత్తలు తప్పవు!

ఫ్రిజ్‌లో పెడితే పదార్థాలు పాడైపోవు అనుకుంటారు చాలామంది. కానీ వాటికీ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. అంతేకాదు.. అవి చూడ్డానికి, రుచికి బాగానే ఉంటాయి.. కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే బ్యాక్టీరియా వాటిలో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ పదార్థం ఎప్పుడు....

Published : 05 Apr 2023 19:45 IST

ఫ్రిజ్‌లో పెడితే పదార్థాలు పాడైపోవు అనుకుంటారు చాలామంది. కానీ వాటికీ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. అంతేకాదు.. అవి చూడ్డానికి, రుచికి బాగానే ఉంటాయి.. కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే బ్యాక్టీరియా వాటిలో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ పదార్థం ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి? ఎన్ని రోజులు ఉంచాలి? తెలుసుకుందాం...

ఏ కాలంలోనైనా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల ఫారన్‌హీట్‌ (4.4 డిగ్రీల సెల్సియస్‌)కు మించకుండా చూసుకోవాలి.

పాలు, పాల పదార్థాలు, మాంసం, కోడిగుడ్లు, చేపలు.. వంటి త్వరగా పాడైపోయే పదార్థాలు బయటి నుంచి తెచ్చిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఒకవేళ బయట ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్‌హీట్‌ (32.2 డిగ్రీల సెల్సియస్‌) కంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెచ్చిన గంటలోపే ఈ పదార్థాల్ని ఫ్రిజ్‌లో పెట్టాలి.

గడ్డకట్టిన పదార్థాలను కిచెన్‌ ప్లాట్‌ఫామ్, టేబుల్‌పై పెట్టి వాటంతటవే కరిగిపోతాయి అని వదిలేయడం మంచిది కాదు. ఎందుకంటే గది ఉష్ణోగ్రత వద్దకు చేరేసరికి ఆయా పదార్థాల్లోని బ్యాక్టీరియా రెండింతలవుతుంది. కాబట్టి కౌంటర్ టాప్స్‌పై పెట్టి ఘనీభవించిన పదార్థాల్ని అస్సలు కరిగించకూడదు. నీటిలో/మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టి కరిగించడం సురక్షితం.

సూప్స్‌, ఇతర కూరల్ని (కాయగూరలు లేదా ఇతర మాంసాహారం కలిపి తయారుచేసినా) మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేయచ్చు.

మిగిలిపోయిన ఆహార పదార్థాలు (మాంసం, పౌల్ట్రీ, చికెన్‌ నగెట్స్‌/ప్యాటీస్‌, పిజ్జా.. వంటివి) ఫ్రిజ్‌లో మూడునాలుగు రోజులు ఉంచచ్చు. అలాగని అన్ని పదార్ధాలను రోజుల తరబడి ఫ్రీజర్లో పెట్టి ఎప్పుడో వినియోగించడం కరక్ట్ కాదు.

అయితే సాధ్యమైనంతవరకు మనం తీసుకునే ఆహార పదార్థాల్ని తాజాగా, పరిశుభ్రంగా, అప్పటికప్పుడు వండుకొని, వేడివేడిగా తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వీలైనంతవరకు మిగిలిపోయిన అన్ని పదార్థాలనీ ఫ్రిజ్‌లో తోసేయకుండా జాగ్రత్త పడడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని