పదేళ్ల లోపే పిరియడ్స్.. ఎందుకిలా?
వయసుకు తగ్గట్లు శారీరక మార్పులు జరిగితేనే ఆనందం. రుతుచక్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాల్సిన రుతుక్రమం పదేళ్ల లోపే వచ్చేస్తే? దానిని ఒక సమస్యగానే భావించాలంటున్నారు నిపుణులు. సరైన అవగాహన పెంచుకుని, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వయసుకు తగ్గట్లు శారీరక మార్పులు జరిగితేనే ఆనందం. రుతుచక్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాల్సిన రుతుక్రమం పదేళ్ల లోపే వచ్చేస్తే? దానిని ఒక సమస్యగానే భావించాలంటున్నారు నిపుణులు. సరైన అవగాహన పెంచుకుని, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అమ్మాయైనా, అబ్బాయైనా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు చోటుచేసుకోవడం సహజం. ఎముకలు, కండరాల ఎదుగుదలతో పాటు, సంతానోత్పత్తికి అనువుగా మరికొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వీటన్నిటితో పాటే అమ్మాయిలకు రుతుచక్రం కూడా సాధారణంగా వచ్చే మార్పే. ఇది పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో పదేళ్ల వయసుకి ముందే నెలసరి మొదలవడం ఎక్కువవుతోంది. ఈ పరిస్థితిని 'ప్రికాషియస్ ప్యూబర్టీ' అంటారు. మూడు నాలుగేళ్ల ముందుగానే ఇలా జరగడానికి కారణాలివీ అని స్పష్టంగా చెప్పలేం. ఆడపిల్ల రజస్వల అవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో శారీరకంగా ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకోవాలి. మెదడులో ఈ ప్రక్రియ మొదలై గొనాడోట్రోఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది పిట్యుటరీ గ్రంథికి చేరి ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ రెండూ అమ్మాయిల్లో శారీరక మార్పులు జరిగేందుకు తోడ్పడే ఈస్ట్రోజెన్‌ను అండాశయాల్లో విడుదలయ్యేలా చేస్తాయి. అప్పట్నుంచి శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాతే నెలసరి రావడం ప్రారంభమవుతుంది.
మార్పుకి కారణాలు..
కొన్నిసార్లు ఎలాంటి సమస్యలు, లోపాలు లేకపోయినా రుతుచక్రం ముందుగానే వచ్చేయవచ్చు. మరికొన్ని సార్లు మెదడు లేదా వెన్నెముకలో కణితి ఉండటం, అమ్మాయి పుట్టే సమయంలో మెదడులో నీరు చేరి కణితిగా మారడం, మెదడూ, వెన్నెముకపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండటం, వాటికి గాయాలవడం కూడా అందుకు కారణం అవుతాయి. ఒక్కోసారి జన్యుపరమైన సమస్యలూ కారణమవుతుంటాయి. అయితే, చాలా తక్కువ మందిలో ఇలా జరుగుతుంది. అడ్రినల్, పిట్యుటరీ గ్రంథులూ, అండాశయాల్లో లోపాల వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ త్వరగా విడుదలవుతుంది. ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల పనితీరులో తేడా, హైపో థైరాయిడిజం వల్ల కూడా రుతుచక్రం ముందే వచ్చేయచ్చు. వయసు, శరీరాకృతికి తగినట్టు సరైన బరువు లేకపోయినా సమస్యే. సన్నగా కనిపించే కొంతమందిలో రుతుక్రమం త్వరగా వచ్చేస్తుంది. సెక్స్ హార్మోన్లుగా పరిగణించే ఈస్ట్రోజెన్, టెస్టోస్టీరాన్లు ఉన్న మాత్రలను తీసుకోవడం వల్ల కూడా ముందే రుతుక్రమం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అండాశయాల్లో ఉండే కణుతులు, సిస్ట్లు కూడా ఈ మార్పును తీసుకురావచ్చు. పిల్లలు జంక్ఫుడ్ని ఎక్కువగా తినడం, అది వారికి పడకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమే అని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
లక్షణాలను ముందే గుర్తించవచ్చు..
అంతగా వూహ తెలియని వయసులో రుతుక్రమం మొదలు కావడంతో చాలామంది అమ్మాయిలు భయపడతారు. ఛాతీ పెరుగుదల, మొటిమలు రావడం, చేతుల కింద వెంట్రుకలు రావడం వంటివి అర్థం కాక అయోమయానికి గురవుతారు. అదీకాక తమ వయసు వారి కన్నా ముందే వేగంగా పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా త్వరగా పరిణతి చెందుతాయి. అయితే రుతుక్రమం మొదలై కొన్నాళ్లు గడిచేటప్పటికి ఆ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. దాంతో కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే వయసుకు తగిన పొడవు ఉండరు. ఈ క్రమంలో- ఈ మార్పుల్ని గమనించి తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వయసుకు తగిన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో రుతుచక్రం మొదలైన అమ్మాయిల్లో తోటివారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవడం, అది ఒత్తిడికి దారి తీయడం, చురుగ్గా లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. శరీర నిర్మాణం, రుతుచక్రం రావడం గురించి అమ్మాయికి విపులంగా వివరించాలి. చిన్న వయసులోనే రుతుక్రమం రావడం సమస్య కాదనీ, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుందని చెప్పాలి. స్కూల్లో, చుట్టుపక్కల వాళ్లు ఆటపట్టించినా, ఏదైనా మాట అన్నా ఆత్మన్యూనతకు గురవకుండా సర్ది చెప్పాలి. ఈ విధంగా ముందుగా మెచ్యూర్ అయిన వాళ్లపై టీవీ, నెట్ ఆకర్షణల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
చిన్నవయసులోనే రుతుక్రమం మొదలైనప్పుడు లేదా అంతకన్నా ముందే ఆ లక్షణాలను గుర్తించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. అమ్మాయి చేయి, మణికట్టును ఎక్స్‌రే తీసి ఎముక వయసును గుర్తిస్తారు. ఎముకల ఎదుగుదల ఎంత వేగంగా ఉందన్నదాన్ని బట్టి హార్మోన్ల పనితీరుని తెలుసుకుంటారు. అలాగే రక్తపరీక్ష, గొనాడోట్రోఫిన్ హార్మోన్ పరీక్ష చేస్తారు. వాటిని బట్టి ఇతర హార్మోన్ల గురించి తెలుసుకుంటారు. మెదడులో లోపాలేమైనా ఉన్నాయా, లేదా అనేది తెలుసుకునేందుకు ఎమ్ఆర్ఐ చేయించుకోమంటారు. కొన్నిసార్లు హైపో థైరాయిడిజం కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది కాబట్టి థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచిస్తారు. వీటివల్ల కేవలం రుతుచక్రం గురించి తెలుసుకోవడమే కాదు, అందుకు కారణమయ్యే ఇతర సమస్యలనూ గుర్తించవచ్చు.
వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి!
పరీక్షలన్నీ చేశాక సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా రుతుచక్రం మొదలైందని తేలితే కొన్ని రకాల మాత్రలను సూచిస్తారు. అయితే కొన్నిసార్లు ఆ మందును ప్రతినెలా ఇంజెక్షన్ రూపంలో చేయించుకోమంటారు. దాని వల్ల కొంతకాలం పాటు ప్రతి నెలా వచ్చే నెలసరి ఆగిపోతుంది. రుతుక్రమానికి తగిన వయసు వచ్చే వరకూ వాటిని వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి సరైన వయసు వచ్చాక డాక్టర్ సలహాతో వాటిని మానేయవచ్చు. ఆ తర్వాత మళ్లీ మార్పులు మొదలవుతాయి. మెదడులో కణుతుల్లాంటివి ఉంటే వాటికి చికిత్స చేయడం వల్ల కూడా ఈ మార్పు జరగకుండా కొంతకాలం అదుపులో ఉంటుంది.
ముందు జాగ్రత్త..
సమస్య వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందుగా జాగ్రత్తపడటమే అన్ని విధాలా మేలు. అలాగే వయసుకు తగినట్లుగా కనీసం ఇరవై నిమిషాలు నడక లేదా యోగా లాంటివి చేయడం చాలా అవసరం. ఒత్తిడి సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. అలాగే జంక్‌ఫుడ్ తగ్గించి, బదులుగా పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వయసుకు తగిన మార్పులు సహజంగా చోటు చేసుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
అనుబంధం
- చాటింగ్ చూసి నమ్మలేకపోయా...!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!