బిడ్డలు పెరిగితే... ఆయుష్షు తగ్గుతుంది!

సృష్టికి మూలం అమ్మే. మాతృత్వాన్ని ఓ వరంగా భావించే మహిళలెందరో! అయితే, ఆ అమ్మతనం మన ఆయుష్షుని తగ్గిస్తుందని మీకు తెలుసా! గర్భం దాల్చిన ప్రతిసారీ అమ్మాయిలు 2.4నుంచి 2.8నెలల బయలాజికల్‌ ఏజ్‌ని కోల్పోతారట.

Published : 11 Jul 2024 03:36 IST

సృష్టికి మూలం అమ్మే. మాతృత్వాన్ని ఓ వరంగా భావించే మహిళలెందరో! అయితే, ఆ అమ్మతనం మన ఆయుష్షుని తగ్గిస్తుందని మీకు తెలుసా! గర్భం దాల్చిన ప్రతిసారీ అమ్మాయిలు 2.4నుంచి 2.8నెలల బయలాజికల్‌ ఏజ్‌ని కోల్పోతారట. అందుకే, పిల్లల్ని కనని వారు లేదా తక్కువ మందిని కన్నవారితో పోలిస్తే... ఎక్కువ మంది సంతానానికి జన్మనిచ్చిన ఆడవాళ్లు వయసుపైబడిన వారిలా కనిపిస్తారట. తాజాగా కొలంబియా యూనివర్సిటీ మెయిల్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా, 1735మంది ఫిలిప్పీన్స్‌ యువతను పరీక్షించారు. ఎక్కువ మంది పిల్లల్ని కన్న ఆడవాళ్ల బయలాజికల్‌ ఏజ్‌లో ఈ మార్పులు కనిపిస్తే, అదే వయసులో ఉన్న నాన్నల బయలాజికల్‌ ఏజ్‌లో మాత్రం ఎటువంటి మార్పులూ లేవట. దీన్నిబట్టి, గర్భధారణ, పాలుపట్టడం... వంటివి ఈ ఏజింగ్‌కు కారణమయి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మహిళల ఆరోగ్యం, ఆయుష్షు మీద ప్రతికూల ప్రభావం ఉంటుందంటున్నారు. అందుకే, ఎక్కువమంది సంతానాన్ని కనడమంటే మన ఆయుష్షుని తగ్గించుకున్నట్లే అనీ, ముఖ్యంగా చిన్న వయసులోనే తల్లయిన అమ్మాయిల్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలనీ పరిశోధకులు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్