ప్రిమెచ్యూర్ డెలివరీ.. కారణాలేంటి?
హాయ్ మేడమ్.. నా బరువు 85 కిలోలు. నాకు ఏడాదిన్నర క్రితం బీపీ సమస్య వచ్చింది. థైరాయిడ్ కూడా ఉంది. నేనొకసారి గర్భం దాల్చాను. అయితే ప్రిమెచ్యూర్ డెలివరీ కారణంగా బేబీ....
హాయ్ మేడమ్.. నా బరువు 85 కిలోలు. నాకు ఏడాదిన్నర క్రితం బీపీ సమస్య వచ్చింది. థైరాయిడ్ కూడా ఉంది. నేనొకసారి గర్భం దాల్చాను. అయితే ప్రిమెచ్యూర్ డెలివరీ కారణంగా బేబీ చనిపోయింది. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించాలంటే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దయచేసి చెప్పండి. - ఓ సోదరి
జ: మీకు ప్రిమెచ్యూర్ డెలివరీ ఏ నెలలో జరిగిందో రాయలేదు. ఇలా నెలలు నిండకుండా కాన్పు కావడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్. అధిక రక్తపోటు, ప్రి-ఎక్లాంప్సియా, గర్భాశయ ద్వారం వదులుగా ఉండడం, గర్భాశయం ఆకృతిలో లోపాలు లేదా శిశువులో లోపాలుండడం.. వంటివి కారణమవుతాయి. కాబట్టి మీరు మళ్లీ గర్భం ధరించే ముందు ఒకసారి వీటన్నింటి కోసం పరీక్షలు చేయించుకుంటే మంచిది. అలాగే మీకున్న అధిక బరువు, బీపీ సమస్యల్ని ముందుగా సరిచేసుకోవాలి. తప్పనిసరిగా బరువు తగ్గాలి. బీపీ పూర్తిగా అదుపులో ఉండాలి. ఈసారి గర్భం దాల్చినప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్‌లో చూపించుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.