ఇమ్యూనిటీని పెంచే పుదీనా షర్బత్..!

వేసవిలో అధిక వేడికి శరీరంలోని శక్తి ఇట్టే ఆవిరైపోతుంది. దాంతో డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం. ఇలా జరగకుండా ఉండడం కోసం చాలామంది జ్యూస్‌లు తాగుతుంటారు. ఈ క్రమంలో శరీరానికి తేమనందించి....

Published : 30 Apr 2023 13:56 IST

వేసవిలో అధిక వేడికి శరీరంలోని శక్తి ఇట్టే ఆవిరైపోతుంది. దాంతో డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం. ఇలా జరగకుండా ఉండడం కోసం చాలామంది జ్యూస్‌లు తాగుతుంటారు. ఈ క్రమంలో శరీరానికి తేమనందించి, వ్యాధినిరోధక శక్తిని పెంచే పుదీనా షర్బత్‌ని ఓసారి ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు

పుదీనా ఆకులు - ఒక కప్పు

నిమ్మకాయ – ఒకటి (రసం తీసి పక్కన పెట్టుకోవాలి)

తేనె - తగినంత (తేనె లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు.. అది కూడా మితంగానే)

వేయించిన జీలకర్ర పొడి - 1/2 టేబుల్‌ స్పూన్

తయారీ

మిక్సీ జార్‌లో పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే దీనికి నీటిని చేర్చుతూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గాజు గ్లాసుల్లోకి తీసుకొని ఐస్‌ ముక్కల్ని చేర్చుకుంటే సరి! ఇలా చిటికెలో చల్లటి నిమ్మ-పుదీనా షర్బత్‌ రడీ అవుతుంది.


ఆరోగ్య ప్రయోజనాలు

ఈ షర్బత్‌లో మనం వాడిన నిమ్మ, పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇక తేనె రుచికే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బీపీని అదుపు చేయడానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం.

శరీరంలో అనవసర కొవ్వుల్ని తగ్గించి బరువును అదుపులో ఉంచడంలో జీలకర్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది.

శరీరానికి తేమను అందించే గుణాలు ఈ షర్బత్‌లో విరివిగా ఉంటాయి. తద్వారా ఈ మండుటెండల్లో శరీరం డీహైడ్రేషన్‌కి గురి కాకుండా కాపాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని