ఆమె సాహసానికి ‘శిఖరా’లే తలవంచంగ!
పర్వతారోహణ అంటే మనం మాట్లాడుకున్నంత సులభం కాదు.. అలుపెరుగని సాధన చేయాలి.. మారే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ.. అకస్మాత్తుగా వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ.. పట్టుదలతో, ఓపికతో లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. మరి, ఇలాంటి సాహసోపేతమైన రంగంలో.......
(Photos: Instagram)
పర్వతారోహణ అంటే మనం మాట్లాడుకున్నంత సులభం కాదు.. అలుపెరుగని సాధన చేయాలి.. మారే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ.. అకస్మాత్తుగా వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ.. పట్టుదలతో, ఓపికతో లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. మరి, ఇలాంటి సాహసోపేతమైన రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకుంది మహారాష్ట్రకు చెందిన ప్రియాంక మోహితే. పర్వతారోహణను తన ప్రవృత్తిగా చేసుకొని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన శిఖరాల్ని అధిరోహించిన ఆమె.. తాజాగా మౌంట్ కాంచన్‌జంగా పర్వతాన్ని అధిరోహించింది. ఫలితంగా సముద్రమట్టం నుంచి 8 వేల మీటర్ల పైచిలుకు ఎత్తులో ఉన్న ఐదు పర్వతాల్ని ముద్దాడిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కిందీ యువ కెరటం. ఈ నేపథ్యంలో ప్రియాంక మౌంటెనీరింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం..!
30 ఏళ్ల ప్రియాంకది పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లా. చిన్న వయసు నుంచి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంపై ఆసక్తి ఉన్నట్లు.. ప్రియాంకకు పర్వతారోహణ అంటే మక్కువ ఉండేది. పెరిగి పెద్దయ్యే కొద్దీ తన అభిరుచిపై మరింత పట్టు సాధించిందామె. ఓవైపు చదువు కొనసాగిస్తూనే, మరోవైపు మౌంటెనీరింగ్‌లో మెలకువలు నేర్చుకుంది.
వృత్తి ప్రవృత్తుల్ని బ్యాలన్స్ చేస్తూ..!
ముంబయి యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీ విభాగంలో పీజీ పట్టా అందుకున్న ప్రియాంక.. ప్రస్తుతం రీసెర్చ్ అసోసియేట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇలా ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు పర్వతారోహణపై దృష్టి పెడుతోంది. తాను టీనేజ్‌లో ఉన్న సమయంలోనే మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్ని అధిరోహించింది ప్రియాంక. ఇక 2012లో ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించి తన మౌంటెనీరింగ్ జర్నీని ప్రారంభించిందామె. ఆపై 2015లో హిమాచల్‌ప్రదేశ్‌లోని రెండో ఎత్తైన శిఖరం మౌంట్ మెంథోసా (6,443 మీటర్లు) శిఖరాగ్రాన్ని చేరుకుంది. పర్వతాన్ని ముద్దాడిన ప్రతిసారీ ఏదో తెలియని గొప్ప అనుభూతిని పొందుతున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ యంగ్ మౌంటెనీర్.
ఆ ఐదు శిఖరాలు.. ఆమె ఒక్కర్తే!
పర్వతారోహణనే తన ఆరోప్రాణంగా భావించిన ప్రియాంక.. ఈ క్రమంలో పలు అనితర సాధ్యమైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచంలోనే మూడో ఎత్తైన శిఖరం మౌంట్ కాంచన్‌జంగా (8,586 మీటర్లు)ను అధిరోహించింది. తద్వారా 8 వేల మీటర్ల పైచిలుకు ఎత్తైన ఐదు పర్వతాల్ని ఎక్కిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. దీనికంటే ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్, మకాలూ, కిలిమంజారో, లోత్సే, అన్నపూర్ణ పర్వతాలను సైతం అధిరోహించి అరుదైన విజయాలు నమోదు చేసింది.
ఇలా పర్వతారోహణలో అనితర సాధ్యమైన రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రియాంకను 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్’తో సత్కరించింది. అంతకంటే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సాహస క్రీడల విభాగంలో ‘శివ్ ఛత్రపతి స్టేట్ అవార్డ్’ అందుకుందీ మౌంటెయిన్ లవర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!