గుండె ఆరోగ్యానికి గుమ్మడి గింజలు!

గుమ్మడి కాయ తింటే మంచిదని తెలుసు గానీ, అందులోని గింజలకూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు. కానీ, ఈ మధ్య సూపర్‌ఫుడ్‌గా వీటిని రోజూ ఓ చెంచా తినమని వైద్యులు చెబుతున్నారు.

Published : 09 Jul 2024 01:33 IST

గుమ్మడి కాయ తింటే మంచిదని తెలుసు గానీ, అందులోని గింజలకూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు. కానీ, ఈ మధ్య సూపర్‌ఫుడ్‌గా వీటిని రోజూ ఓ చెంచా తినమని వైద్యులు చెబుతున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందామా!

గుమ్మడి గింజల్లో ఫైబర్‌ ఎక్కువ. జీర్ణసంబంధిత సమస్యలూ, అధికబరువు... వంటివాటితో బాధపడేవారు రోజూ ఓ చెంచా గింజల్ని తినండి. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా ఆహారం తినే అలవాటుని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువూ తగ్గుతారు. అలానే జీర్ణ ప్రక్రియనూ మెరుగుపరుస్తుంది.

  • ఈ గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌-ఇ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కణాలను అడ్డుకుంటాయి.
  • యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు గుమ్మడి గింజల్లో ఉంటాయి.  ముఖ్యంగా వీటిల్లో ఉండే ట్రైగోనిలైన్, నికోటినిక్‌ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్‌ అనే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనుకాకుండా చేస్తాయి.
  • గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, జింక్‌ మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా మెగ్నీషియం బీపీని నియంత్రించి, గుండెకి రక్షణగా పనిచేస్తే,  జింక్‌.. శరీరం విటమిన్లనీ, ఖనిజాలనీ గ్రహించడంలో సాయపడుతుంది. థైరాయిడ్‌ హార్మోను ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. ప్రొటీన్‌ తగినంతగా లభించడం వల్ల కండరాలూ ఆరోగ్యంగా ఉంటాయి. నిస్సత్తువ దరిచేరదు.
  • కొందరిని నిద్రలేమి సమస్య వేధిస్తుంది. వీరు గుమ్మడి గింజల్ని తీసుకుంటే మేలు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్‌లు మెలటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో హాయిగా నిద్రపోగలరు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్