చర్మంపై ముడతలు.. ఇవీ కారణం కావచ్చు!
చిన్న వయసులో ఉన్నా కొంతమంది ముఖం ముడతలు పడి ఉంటుంది. దీనివల్ల వారు పెద్ద వయసువారిలా కనిపిస్తుంటారు. ముఖం పైన ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు. వీటికి తోడు దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న....
చిన్న వయసులో ఉన్నా కొంతమంది ముఖం ముడతలు పడి ఉంటుంది. దీనివల్ల వారు పెద్ద వయసువారిలా కనిపిస్తుంటారు. ముఖం పైన ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు. వీటికి తోడు దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ముడతలు రావడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మనం చేసే ఆ చిన్న పొరపాట్లేమిటో, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం రండి...
మోతాదుకు మించి వద్దు..
చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా చర్మం ముడతలు పడడానికి కారణమవుతుంటుంది. రోజూ తగినంత మోతాదులో చక్కెరను ఆహారంలో భాగం చేసుకోవడం అవసరమే. అయితే మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ మొదలవుతుంది. ఫలితంగా చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడడం ప్రారంభిస్తుంది.
వాటిని పూర్తిగా దూరం పెట్టద్దు..
చర్మం అందంగా, మృదువుగా కనిపించడానికి తగు పరిమాణంలో కొవ్వులు కూడా అవసరమే. అయితే చాలామంది లావవుతామన్న భయంతో కొవ్వు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఫలితంగా వీటి ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందవు. ఈ ఆమ్లాలు చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదపడతాయి. అంతేకాదు.. ఇవి మెదడు చురుగ్గా పని చేయడానికి కూడా తోడ్పడతాయి. అలాగే గుండెను కూడా పదిలంగా కాపాడతాయి. అందుకే కొవ్వు పదార్థాలను కూడా అవసరమైన మేరకు ఆహారంలో చేర్చుకోవాలి.
ఒక పక్కకే నిద్రపోతున్నారా?
ఒక్కోసారి నిద్రపోయే విధానం కూడా చర్మం ముడతలు పడడానికి కారణం కావచ్చు. చాలామందికి ఒక పక్కకే తిరిగి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా రోజూ ఒకే దిశలో నిద్రపోవడం వల్ల ఆ వైపు ఉన్న చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. చాలామంది చెంపలను దిండుకు ఆనించి నిద్రపోతుంటారు. అలా కాకుండా తలను ఆన్చి నిద్రపోవాలి. ఎందుకంటే తలగడ వల్ల ముఖ చర్మం ఒత్తిడికి గురై ముడతలు పడే అవకాశం ఉంటుంది.
బ్రాండ్ ఒక్కటే సరిపోదు..
చాలామంది సబ్బును బ్రాండ్‌ని బట్టి ఉపయోగిస్తుంటారు. అంతేతప్ప ఆ సబ్బు చర్మానికి సరిపడుతుందా లేదా అని ఆలోచించరు. ఇలా చేయడం వల్ల కూడా ఒక్కోసారి చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారినట్లుగా తయారవుతుంది. అందుకే శరీరతత్వానికి సరిపోయే సబ్బును ఎంచుకోవాలి. ఈ విషయంలో అవసరమైతే సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!