పీసీఓఎస్‌ తగ్గాలంటే..

పొట్ట కండరాలు బలపడటానికీ, వెన్నెముక, పీసీఓఎస్‌ సమస్యలు తగ్గటానికీ, సిస్టులు, ఫైబ్రాయిడ్స్‌ కరగడానికీ ఉష్ట్రాసనం బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా రెండు కాళ్లను వెనకకు మడిచి కూర్చోవాలి.

Published : 01 Jun 2024 04:43 IST

పొట్ట కండరాలు బలపడటానికీ, వెన్నెముక, పీసీఓఎస్‌ సమస్యలు తగ్గటానికీ, సిస్టులు, ఫైబ్రాయిడ్స్‌ కరగడానికీ ఉష్ట్రాసనం బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా రెండు కాళ్లను వెనకకు మడిచి కూర్చోవాలి. తరవాత నెమ్మదిగా మోకాళ్ల మీద లేచి కుడిచేత్తో కుడికాలి మడమని, ఎడమచేత్తో ఎడమ కాలిమడమని వెనక్కి వాలుతూ ఫొటోలో చూపిన విధంగా పట్టుకోవచ్చు. మొదటిసారి ప్రయత్నించేవారు పాదాన్ని అందుకోలేకపోతే పాదాన్ని వేళ్లమీద ఆనించి మడమని పట్టుకోవాలి. ఈ ఆసనాన్ని పదిసెకన్లు చొప్పున రోజుకి మూడుసార్లు చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చి మోకాళ్లపై కూర్చోవాలి. ఈ ఆసనం చేశాక దీని అనుబంధ ఆసనం కూడా చేస్తే మరింత ఫలితం చేకూరుతుంది.


శశాంకాసనం..

ఉష్ట్రాసనం వేసిన తరవాత ఈ శశాంకాసనం చేస్తే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అందుకే దీన్ని శాంతినిచ్చే ఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడంవల్ల ఛాతీ, పొట్ట, వెన్నెముక కండరాలకి నూతన శక్తి లభించి హాయిగా ఉంటుంది. మంచి నిద్రపడుతుంది. కోపం అదుపులో ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా రెండు చేతులనూ పైకి పెట్టి, శ్వాస వదులుతూ మెల్లగా వంగి, చేతులను ముందుకు ఫొటోలో చూపిన విధంగా ఉంచాలి. ఈ క్రమంలో నుదుటిభాగం నేలను తాకేలా ఆనించాలి. మొదటిసారి ప్రయత్నించేవారు దిండుసాయంతో చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్