Published : 01/12/2021 19:20 IST

‘స్పా’ నూనెను ఇంట్లోనే తయారుచేద్దాం!

ఒత్తిడిని చిత్తు చేయడానికి ప్రస్తుతం ఎన్నో సహజసిద్ధమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్పా కూడా ఒకటి. అయితే ఇందుకోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి స్పా సెంటర్లకు వెళ్తుంటారు చాలామంది. నిజానికి ఆ అవసరం లేకుండా ఇంట్లోనే.. అదీ మన స్వహస్తాలతో తయారుచేసిన నూనెతోనే శరీరాన్ని మర్దన చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ స్పా కోసం వాడే Infused Oilsని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

ఔషధ గుణాలు కలిగిన పూలు/ఆకులను మన శరీరతత్వానికి సరిపోయే నూనెలో కొంత కాలం పాటు నానబెట్టి ఉంచడం వల్ల.. నూనెలు ఆ పూలు లేదా ఆకులలోని సారాన్ని, వాటి సహజ పరిమళాన్ని, ఔషధ గుణాలని శోషించుకుంటాయి. ఇలాంటి నూనెలను ‘ఇన్‌ఫ్యూజ్‌డ్ ఆయిల్స్’ అంటారు.

కావాల్సినవి

* బంతి పూలు, గులాబీలు, మల్లె పూలు, జాజి పూలు, లావెండర్.. వీటిలో మీకు నచ్చిన పూలు లేదా ఎండబెట్టిన పుదీనా, తులసి వంటి ఆకుల్ని తీసుకోవాలి. ఇవి శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం.

* శుద్ధి చేయని సన్‌ఫ్లవర్ నూనె, ఆలివ్ నూనె, జొజోబా నూనె.. శుద్ధమైన కొబ్బరి నూనెలలో ఏదైనా ఒక నూనెను ఎంచుకోవాలి.

* శుభ్రమైన గాజు జార్

* వెడల్పాటి గిన్నెలో సగానికి నీరు నింపాలి.

తయారీ

* ఎండిన బంతిపూలని(లేదా మరేవైనా పూలు లేక ఆకులను) శుభ్రమైన జార్‌లో సగం వరకు నింపాలి.

* ఇప్పుడు మీరు ఎంచుకున్న నూనెను ఎండిన పూలు పూర్తిగా మునిగేలా, ఒక అంగుళం ఖాళీ ఉంచి గాజు జార్‌లో నింపాలి.

* మూత గట్టిగా బిగించి జార్‌ని బాగా షేక్ చేయాలి.

* ఈ మిశ్రమాన్ని ఇన్‌ఫ్యూజ్ చేయడానికి (శోషింపజేయడానికి) మూడు పద్ధతులు ఉన్నాయి.

1. ఈ గ్లాస్ జార్‌ను నాలుగు వారాల పాటు చీకటి ప్రాంతంలో ఉంచి ప్రతి రెండు రోజులకు ఒకసారి బాగా కలపాలి. చివరగా నాలుగు వారాల తర్వాత నూనెను వడగట్టి వాడుకోవాలి.

2. ఈ గ్లాస్ జార్‌ను నాలుగు వారాల పాటు ప్రతిరోజూ ఎండలో ఉంచాలి. నాలుగు వారాలు పూర్తయిన తర్వాత నూనెను వడగట్టి ఉపయోగించాలి.

3. ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని మరిగించి, అందులో ఈ మిశ్రమం కలిగిన జార్‌ని ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. చల్లారిన తర్వాత 24 గంటల పాటు ఉంచి తర్వాత వడగట్టి వాడుకోవాలి.

*నూనె వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిని మాయిశ్చరైజింగ్ స్క్రబ్‌గా వాడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని