ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిద్దామిలా..!
బ్రష్‌లు, బాటిళ్లు, డబ్బాలు, కప్పులు.. ఇలా పాతబడిపోయిన ప్లాస్టిక్ వస్తువులు మనింట్లోనూ బోలెడన్ని ఉంటాయి. అయితే పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి వస్తువుల్ని బయట పడేయడం కంటే తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగకుండా కాపాడుకోవచ్చు.
బ్రష్‌లు, బాటిళ్లు, డబ్బాలు, కప్పులు.. ఇలా పాతబడిపోయిన ప్లాస్టిక్ వస్తువులు మనింట్లోనూ బోలెడన్ని ఉంటాయి. అయితే పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి వస్తువుల్ని బయట పడేయడం కంటే తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగకుండా కాపాడుకోవచ్చు. అందుకూ కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం రండి..
పెన్ హోల్డర్‌గా..
చిన్నారులు పెన్నులు, పెన్సిళ్లు, స్కెచ్‌లు వంటివన్నీ ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. కాస్త సమయం వెచ్చిస్తే ప్లాస్టిక్ కప్పులు, కూల్‌డ్రింక్ బాటిళ్లను అందమైన పెన్స్టాండ్గా మార్చేయచ్చు. కూల్‌డ్రింక్ బాటిల్‌ను సగానికి కత్తిరించి దాన్ని పెన్నులు పెట్టడానికి ఉపయోగించవచ్చు. కప్పులనైతే చక్కగా పెయింటింగ్ వేసి లేదా అందమైన గిఫ్ట్ర్యాపర్ చుట్టి పెన్నుల స్టాండ్‌గా ఉపయోగించుకోవచ్చు.
ప్రాజెక్టు వర్కుల కోసం..
పాఠశాలలో చిన్నారులకు కొన్ని ప్రాజెక్ట్ వర్కులు ఇస్తుంటారు. ఆ సమయంలో అవసరమైన వాటి కోసం స్టేషనరీ షాపులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే వాటికి బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించుకోవచ్చు. వాటిని ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారుచేయడంపై యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలుంటాయి. వాటిని ఫాలో అయిపోయి కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయచ్చు.
అందమైన ఫ్లవర్‌వాజులు, పూలను సైతం ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
కాయిన్ బాక్స్..
కొంతమంది రూపాయి, రెండు రూపాయల నాణేలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు. అవసరమైనప్పుడు వాటిని వెతుక్కొంటూ ఉంటారు. ఇలా కాకుండా ఓ ప్లాస్టిక్ కప్పులో, కాయిన్ పట్టేంత మూతి ఉన్న బాటిల్లో వీటిని వేయచ్చు. లేదంటే.. ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని దాన్ని మెడ వరకు లేదా కాయిన్ పట్టేంత వరకు కత్తిరించి దానిలో నాణేలు వేసుకోవచ్చు.
గార్డెనింగ్ చేయచ్చు..
మొక్కలకు నీరందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించడం మనకు తెలిసిందే! అయితే దీన్ని పెరట్లో ఏర్పాటు చేసుకోవడం కష్టమే. కానీ ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతోనే మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం ప్లాస్టిక్ బాటిల్ అడుగుభాగానికి అతి సన్నని రంధ్రం చేసి దానిలో నీటిని నింపి మొక్క మొదళ్లలో ఉంచితే సరిపోతుంది.
బర్డ్ ఫీడర్‌గా..
ఇంట్లో పక్షులను పెంచుకోవడం చాలామందికి సరదా. అయితే వాటికి ఆహారం వేసే విషయం కొన్నిసార్లు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎదురు కాకూడదనే చాలామంది బర్డ్ ఫీడర్లను ఉపయోగిస్తారు. అయితే వీటిని కొనాలంటే అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సిందే. కానీ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే వీటిని తయారుచేసుకోవచ్చు. అందుకోసం యూట్యూబ్ వీడియోలు ఫాలో కావచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!