అసోం బడిలో రోబో టీచర్‌..!

సంప్రదాయ దుస్తులైన మేఖేలా ఛాదర్‌ను ధరించి, మెడలో ఆభరణాలతో అసోం, గువాహటిలోని ఓ ప్రైవేటు స్కూల్‌ తరగతి గదిలోకి అడుగుపెట్టిందామె. ఆ కొత్త టీచర్‌ను చూసి విద్యార్థులంతా విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, కృత్రిమ మేధస్సు(ఏఐ)తో రూపొందించిన రోబో టీచర్‌ ‘ఐరిస్‌’.

Published : 02 Jun 2024 04:20 IST

సంప్రదాయ దుస్తులైన మేఖేలా ఛాదర్‌ను ధరించి, మెడలో ఆభరణాలతో అసోం, గువాహటిలోని ఓ ప్రైవేటు స్కూల్‌ తరగతి గదిలోకి అడుగుపెట్టిందామె. ఆ కొత్త టీచర్‌ను చూసి విద్యార్థులంతా విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, కృత్రిమ మేధస్సు(ఏఐ)తో రూపొందించిన రోబో టీచర్‌ ‘ఐరిస్‌’. తరగతిలోని పిల్లలకు షేక్‌హ్యాండ్‌ ఇస్తూ మొదట తనని పరిచయం చేసుకుంది. ఆపై వారడిగిన ప్రశ్నలన్నింటికీ వివరణాత్మకంగా సమాధానాలు  చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించింది. నీతి ఆయోగ్‌ ప్రారంభించిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ (ఏటీఎల్‌) ప్రాజెక్టు కింద మేకర్‌ల్యాబ్స్‌ ఎడ్యు-టెక్‌ సహకారంతో ఈ రోబోను తయారుచేశారు. పాఠశాలల్లో ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ను పెంపొందించేందుకు దీన్ని రూపొందించారు. పిల్లలడిగే ప్రశ్నలు కొన్ని సిలబస్‌లో లేకపోయినా అతి తక్కువ సమయంలోనే వాటికి కూడా సమాధానాన్ని ఉదాహరణలతోసహా వివరించి పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈశాన్య భారతదేశంలో తొలి ఏఐ ఉపాధ్యాయురాలిగా నిలిచిందీ ఐరిస్‌ రోబో. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్