Scalp Massagers : కుదుళ్లకు హాయి హాయి!

అసలే ఎండాకాలం.. వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల ఒళ్లంత చెమటలు పట్టడంతో చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక ఈ చెమటకు జుట్టు కుదుళ్లు జిడ్డుగా మారిపోతాయి. ఇది క్రమంగా జుట్టు రాలడం, చుండ్రు, కుదుళ్లలో మృతకణాలు....

Published : 28 May 2023 13:32 IST

అసలే ఎండాకాలం.. వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల ఒళ్లంత చెమటలు పట్టడంతో చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక ఈ చెమటకు జుట్టు కుదుళ్లు జిడ్డుగా మారిపోతాయి. ఇది క్రమంగా జుట్టు రాలడం, చుండ్రు, కుదుళ్లలో మృతకణాలు ఏర్పడడం.. వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ తరహా సమస్యలకు చెక్‌ పెట్టాలంటే జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా, దృఢంగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఇందుకు ఉపకరించే ‘స్కాల్ప్‌ మసాజర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో దొరుకుతున్నాయి.

గుండ్రటి దువ్వెన, ఆక్టోపస్‌, చేయి ఆకృతిలో, గుండ్రంగా అమర్చిన పుల్లల మాదిరిగా.. ఇలా విభిన్న రకాలుగా తయారైన ఈ స్కాల్ప్‌ మసాజర్స్‌కు సులభంగా పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్‌ కూడా ఉంటుంది. వీటికి ఉండే మృదువైన బ్రిజిల్స్‌/రోలర్స్‌తో కుదుళ్లపై మర్దన చేసుకోవడం వల్ల ఆ భాగంలో రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా మారతాయి. తద్వారా జుట్టు సమస్యల నుంచి విముక్తి కలగడంతో పాటు తలనొప్పి, మైగ్రెయిన్‌.. వంటి సమస్యల నుంచీ ఉపశమనం పొందచ్చు. ఇక వీటిలో కొన్ని.. ముందే ఛార్జ్‌ చేసుకునేలా ఉన్నవీ దొరుకుతున్నాయి. వీటిని కుదుళ్లపై పెట్టి బటన్‌ నొక్కితే చాలు.. వాటికుండే బ్రిజిల్స్‌ వాటంతటవే తిరుగుతూ కుదుళ్లపై మసాజ్‌ చేస్తాయి. షాంపూ చేసుకునే సమయంలోనూ వీటిని ఉపయోగించచ్చు.. తద్వారా అటు కుదుళ్లకు మర్దన చేసుకున్నట్లవుతుంది.. కుదుళ్లపై ఉన్న జిడ్డు, చుండ్రు.. వంటివీ తొలగిపోతాయి. ఇలా బహుళ ప్రయోజనాలున్న ఈ స్కాల్ప్‌ మసాజర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని