Health Consultation: నెట్టింట వెతుకుతున్నారా?

ఇంట్లో వాళ్లకు చిన్న నలత చేసినా వైద్యులను సంప్రదించే ఆడాళ్లు.. వాళ్ల అనారోగ్యాల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇప్పుడు లక్షణాలను గూగుల్‌లో వెతికి నిర్ణయాలు తీసుకుంటున్న వారు పెరిగారు. ఓ అధ్యయనం ప్రకారం ఇలా చేస్తున్న వారిలో మహిళలే ఎక్కువ. ఇది సరి కాదంటున్నారు నిపుణులు.

Published : 16 May 2023 00:31 IST

ఇంట్లో వాళ్లకు చిన్న నలత చేసినా వైద్యులను సంప్రదించే ఆడాళ్లు.. వాళ్ల అనారోగ్యాల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇప్పుడు లక్షణాలను గూగుల్‌లో వెతికి నిర్ణయాలు తీసుకుంటున్న వారు పెరిగారు. ఓ అధ్యయనం ప్రకారం ఇలా చేస్తున్న వారిలో మహిళలే ఎక్కువ. ఇది సరి కాదంటున్నారు నిపుణులు.

మానవ శరీరమే ప్రత్యేకం. ఏ ఒక్కరి అనారోగ్యమూ ఒకేలా ఉండదు. ఉదాహరణకు వాంతులు అవుతున్నాయనుకుందాం. అందరూ గర్భవతులే అవ్వాలనేమీ లేదు కదా! అన్నం అరగకపోవడం, కడుపులో ఇన్ఫెక్షన్‌.. ఇలా చాలా కారణాలుంటాయి. కడుపులోది అంతా బయటకు పోతుంది కాబట్టి, నీరసమూ సాధారణమే. వాంతులు, కళ్లు తిరగడం, నీరసం అని వెదికి, ఆ ఫలితాల ఆధారంగా మందులు తీసుకుంటే.. పప్పులో కాలేసినట్టేగా!

ఈ నెట్టింట ఆధారపడే తీరు కొన్నిసార్లు ఒత్తిడినీ పెంచుతోందట. కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉందని వెతికితే.. గుండె జబ్బు ప్రమాదం అని రావొచ్చు. కానీ అందరికీ అది వర్తిస్తుందనేం లేదు. ఇతర అంశాలనూ పరిగణించాలి. ఆ ఫలితం చూసి అనవసర కంగారు, ఇతర అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి, శరీరం సహకరించట్లేదు అన్నప్పుడు వైద్యులను సంప్రదించడమే దారి.

తీసుకెళ్లే వాళ్లు లేకపోవడం, ఒంటరిగా వెళ్లడం అయిష్టమా? అప్పుడు ఇంటర్నెట్‌ సాయం తీసుకోండి. అదెలాగంటే.. ఇప్పుడు ఎన్నో వేదికలు ఆన్‌లైన్‌ వైద్య సదుపాయం కల్పిస్తున్నాయి. నామమాత్రపు ఫీజు తీసుకుంటారు. ఇంటికొచ్చి చికిత్స చేస్తున్నవారూ ఉన్నారు. అలా ఉపయోగించుకుంటే పర్లేదు. అంతేకానీ నెట్‌ ఫలితాలపై ఆధారపడి సొంత వైద్యం చేసుకుంటే శరీరానికీ, మనసుకీ రెంటికే దెబ్బే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్