రహస్య కెమెరా పట్టేద్దాం...

షాపింగ్‌ మాళ్లు, హోటల్‌ గదులు, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో రహస్య కెమెరాలు అమర్చి... అమ్మాయిల ఛాయాచిత్రాలను రికార్డు చేస్తున్న సంఘటనల గురించి వింటున్నాం.  రహస్యకెమెరాలను గుర్తించగలిగితే, వాటి బారిన పడకుండా చూసుకోవచ్చంటున్నారు  నిపుణులు.

Updated : 28 Nov 2022 09:19 IST

షాపింగ్‌ మాళ్లు, హోటల్‌ గదులు, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో రహస్య కెమెరాలు అమర్చి... అమ్మాయిల ఛాయాచిత్రాలను రికార్డు చేస్తున్న సంఘటనల గురించి వింటున్నాం.  రహస్యకెమెరాలను గుర్తించగలిగితే, వాటి బారిన పడకుండా చూసుకోవచ్చంటున్నారు  నిపుణులు. 
* గది గోడపై అలంకరణ, పుస్తకాలు, అల్మారాల్లో అమర్చే బొమ్మలు, అల్మారాల తలుపులు, మొక్కలు, కుండీలు, టేబుల్‌ ల్యాంపులపై రహస్యకెమెరాలు అమర్చే అవకాశాలుంటాయి. 
* దుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేసి, వేసుకుని చూసేందుకు ట్రయల్‌ రూంకు వెళతాం. అలాగే హోటల్‌ గది, హాస్టల్‌ వంటి ప్రాంతాల్లో రహస్య కెమెరాను పసిగట్టాలంటే వెళ్లగానే ముందుగా ఆ ప్రాంతాన్నంతా పరిశీలించాలి. గోడకు చిన్న బటన్‌లా ఉండి, వైర్లతో అనుసంధానమై ఉంటే అది రహస్య కెమెరా కావచ్చు. 
* గదిలోకి వెళ్లేసరికి ఏదైనా చిన్నగా శబ్దం వస్తుందేమో గమనించాలి. కొన్ని రహస్య కెమెరాలు పనిచేస్తున్నప్పుడు చిన్నగా శబ్దం వస్తుంది. దాన్ని గుర్తిస్తే అక్కడ కెమెరా పనిచేస్తున్నట్లే అర్థం. 
* గోడపై అద్దం ఉంటే సునిశితంగా గమనించాలి. మీ చూపుడువేలును 90 డిగ్రీల కోణంలో అద్దంపై ఉంచాలి. మీ వేలు ప్రతిబింబానికి, మీ వేలుకు మధ్య అంగుళమైనా దూరం ఉండాలి. రెండూ ఒకేచోట ఉన్నట్లుంటే మాత్రం అది టూవే మిర్రర్‌ అని అర్థం. ఇటువంటి చోట రహస్య కెమెరా ఉండే అవకాశం ఎక్కువ. 
* రాత్రి సమయంలో గదిలో కెమెరా ఉందా అని గుర్తించాలంటే, ముందుగా లైట్లన్నీ తీసేయాలి. గదిలో ఎక్కడినుంచైనా ఎరుపు లేదా ఆకుపచ్చని వర్ణంలో చిన్న చుక్కగా లెడ్‌ లైట్‌ కనిపిస్తే మాత్రం అక్కడ నైట్‌విజన్‌ కెమెరా పనిచేస్తున్నట్లే. 
* గదిలో ఫోన్‌ మాట్లాడేటప్పుడు మధ్యలో మీకు ఏదైనా శబ్దం వినిపిస్తే మాత్రం పరిగణించండి. కొన్ని సెల్‌ఫోన్లు ఇటువంటి ఎలక్ట్రోమాగ్నటిక్‌ సంకేతాలను గ్రహించగలవు. అటువంటప్పుడు మీకు అనుమానం కలిగిన ప్రాంతంలో మీ సెల్‌ఫోన్‌ను ఉంచాలి. అప్పుడు ఆ శబ్దం మరింత ఎక్కువగా ఉందంటే మాత్రం అక్కడ ఏదైనా 
రహస్య పరికరం ఉన్నట్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్