పిల్లల పైనా లైంగిక వేధింపులెన్నో.. జాగ్రత్త!
మనం మన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా, పువ్వులంత సున్నితంగా చూసుకుంటాం. మరి మనం కంటికి రెప్పలా చూసుకునే ఆ పిల్లలకు మనం లేనప్పుడు, మనింటి బయట కూడా అంతే ప్రేమ, భద్రత దొరుకుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. స్కూళ్లు, బస్సులు, పార్కులు, కొన్నిసార్లు మన ఇల్లే వాళ్లపై వేధింపులకు నిలయాలుగా మారచ్చు. దగ్గరి బంధువులు, తెలిసిన వాళ్లు, స్కూల్లో పనిచేసేవాళ్లే 'బూచాళ్లు'గా మారి పిల్లల ఆనందాన్ని హరించేయచ్చు.........
మనం మన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా, పువ్వులంత సున్నితంగా చూసుకుంటాం. మరి మనం కంటికి రెప్పలా చూసుకునే ఆ పిల్లలకు మనం లేనప్పుడు, మనింటి బయట కూడా అంతే ప్రేమ, భద్రత దొరుకుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. స్కూళ్లు, బస్సులు, పార్కులు, కొన్నిసార్లు మన ఇల్లే వాళ్లపై వేధింపులకు నిలయాలుగా మారచ్చు. దగ్గరి బంధువులు, తెలిసిన వాళ్లు, స్కూల్లో పనిచేసేవాళ్లే 'బూచాళ్లు'గా మారి పిల్లల ఆనందాన్ని హరించేయచ్చు. మరి ఏం చేయాలి? ఎప్పుడూ వాళ్లని మనతోనే ఉంచుకోగలమా? లేదు.. అందుకే వాళ్లకు సంతోషకరమైన భవిష్యత్తును అందించాలంటే వాళ్లకు ఎవరితో ఎలా మెలగాలో, ఎలాంటి సందర్భంలో ఎలా స్పందించాలో వివరించాలి. అప్పుడే ఇంటాబయటా పొంచి ఉన్న ప్రమాదాల బారి నుంచి వాళ్లను రక్షించుకోగలుగుతాం..
స్కూల్లో..
పిల్లలు ఎక్కువ టైం గడిపేది స్కూల్లోనే.. అక్కడి టీచర్లు, ఆయాలు, మిగిలిన సిబ్బందితో వాళ్లు అనుబంధం పెంచుకుంటారు. వారి వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ పిల్లలతో ఉన్న చనువును అడ్డం పెట్టుకొని వాళ్లు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో స్కూలు వాతావరణం ఎలా ఉందని గమనించడం తప్పనిసరి. కేవలం మంచి పేరున్న స్కూల్లో చేర్పించేశాం అని అనుకోవడం పూర్తిగా సరికాదు. ఎంత మంచి పేరున్న స్కూలైనా తరచూ మీ పిల్లల క్లాస్ టీచర్‌తో మాట్లాడుతూ ఉండాలి. పిల్లల చదువు గురించే కాకుండా వాళ్ల ప్రవర్తన గురించి కూడా ఆరా తీయాలి. పేరెంట్, టీచర్ మీటింగ్స్‌కి తప్పకుండా హాజరవ్వాలి. అలాగే పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని తప్పకుండా వినాలి. వాళ్లు చెప్పే విషయాలను పట్టించుకోకుండా వదిలేయకూడదు. వాళ్లేదైనా చిన్న సమస్య గురించి చెప్పినా కొట్టిపడేయకుండా దాన్నుంచి ఎలా బయటపడాలో వాళ్లకు వివరించండి. ఇప్పుడిప్పుడే కొన్ని స్కూళ్లు మానసిక నిపుణులను అందుబాటులో ఉంచుతున్నాయి. అవసరాన్ని బట్టి వాళ్ల సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటివల్ల అదనపు భద్రత ఉంటుందని మీరు భావిస్తే పిల్లలను అలాంటి స్కూళ్లలోనే చేర్చొచ్చు.
టాయిలెట్ల దగ్గర..
స్కూల్లో టాయిలెట్ల దగ్గర పిల్లలు అవహేళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లెంత చిన్న పిల్లలైనా సరే.. తమను చూసి ఎదుటివాళ్లు నవ్వడం, లేదా వెక్కిరించడం చేస్తే చాలా బాధపడతారు. ఈ విషయాలను కొందరు బయటకు చెబితే మరికొందరు చెప్పుకోవడానికి భయపడతారు. అందుకే పిల్లల వయసు, వాళ్లు అర్థం చేసుకునే తీరును బట్టి టాయిలెట్‌కి వెళ్లినప్పుడు లోపలి నుంచి గడియ పెట్టుకోవాలా? లేదా? అన్నది వివరించి చెప్పాలి. మరీ చిన్నపిల్లలైతే బయట ఒకరిని తోడుగా నుంచోమని చెప్పాలి. కొత్తవారిని లోపలికి రానివ్వకుండా చూసుకోమనాలి.
ప్లే గ్రౌండ్లో..
ఒత్తిళ్లన్నీ మర్చిపోయి పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే ప్రదేశం ప్లే గ్రౌండ్. కలిసి చదువుకునే వాళ్లతో ఆడుకోవడమే కాదు.. కొత్త వాళ్లతో పరిచయాలు కావడానికి ఇక్కడే ఆస్కారం ఉంటుంది. అయితే ఆటవస్తువులు ఉంచే, లేదా దుస్తులు మార్చుకునే గదులు దూరంగా జనసంచారం లేకుండా ఉంటాయి కాబట్టి వాటిలోకి ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని పిల్లలకు సూచించాలి. తమ స్నేహితులతో కలిసి వెళ్లడాన్ని ప్రోత్సహించాలి. కొన్నిసార్లు ఆటలాడేటప్పుడు పిల్లల షర్ట్, స్కర్ట్ చిరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు అవమానానికి గురి కాకుండా ఉండటం కోసం స్కూల్ లాకర్లో మరో అదనపు యూనిఫాం ఉంచాలి. ఈ సౌకర్యాన్ని ఇప్పటికే చాలా స్కూళ్లు అమలు చేస్తున్నాయి. ఒకవేళ మీ పిల్లల స్కూల్లో లాకర్ సదుపాయం లేకపోతే పేరెంట్, టీచర్ మీటింగ్ జరిగినప్పుడు ఆ సదుపాయం కోసం అడగొచ్చు.
నెలసరి విషయంలో..
ఆడపిల్లలు అనుకోకుండా వచ్చే నెలసరితో ఏం చేయాలో తెలియక బిత్తర పోతారు. ఈ కారణంగా స్కూల్లో కొన్నిసార్లు ఆటపట్టింపులకు, బాధాకరమైన వ్యాఖ్యలకు కూడా గురవుతారు. ఇలాంటి సందర్భాల గురించి పిల్లలకు ముందుగానే వివరించాలి. అలాంటి పరిస్థితుల్లో టీచర్లతో విషయం చెప్పమనాలి. ముందు జాగ్రత్తగా బ్యాగ్‌లో శానిటరీ న్యాప్కిన్ను ఉంచాలి. ఒకవేళ న్యాప్కిన్ లేకపోయినా, స్నేహితురాలి సహాయంతో పర్మిషన్ తీసుకొని దగ్గర్లోని బంధువుల ఇంటికో, మీ ఇంటికో రమ్మని చెప్పాలి. ఇవేవీ కుదరని పక్షంలో స్కూలు నుంచి మీకు ఫోను చేయిస్తే వెంటనే వచ్చి తీసుకెళ్తామన్న భరోసా వాళ్లకు కలిగించాలి.
బస్సుల్లో.. విహార యాత్రల్లో..
పిల్లలు ఎక్కువగా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురయ్యేది బస్సుల్లోనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. బస్సుల్లో ఉండే పెద్దగా చదువుకోని డ్రైవర్లు, కండక్టర్లతోనే పిల్లలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగని అందరూ అలా ఉంటారని చెప్పలేం.. అందరినీ అనుమానించలేం.. కానీ తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. డ్రైవర్లు, కండక్టర్లతో తరచూ మాట్లాడాలి. వాళ్ల ప్రవర్తనని కొంతవరకు అంచనా వేయాలి. మద్యం తాగేవాళ్లు, అసభ్యంగా మాట్లాడేవాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. చాలామంది పిల్లలు నవ్వుతూ డ్రైవర్ పక్కనే కూర్చుంటూ ఉంటారు. కానీ వాళ్లకు ఎప్పుడూ వెనకే కూర్చోమని చెప్పాలి. పిల్లల్ని బస్సు ఎక్కించడం, తిరిగి సాయంత్రం దింపడం కూడా మనమే చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు బస్సు ఎక్కే చోట, దిగే చోట అపరిచితులు ఉంటూ ఉంటారు. అందుకే పిల్లలకు కూడా స్కూల్లోనే బస్సు దిగమని చెప్పాలి.
ఇవే కాదు.. ఇంకా పిక్నిక్లనీ, విజ్ఞాన యాత్రలని, ఎన్ఎస్ఎస్ క్యాంపులని పిల్లల్ని ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లడం ఈ రోజుల్లో కామనైపోయింది. అటువంటప్పుడు అమ్మానాన్నల పర్యవేక్షణ ఉండదు. ఈ క్రమంలో టీచర్ చెప్పినట్టు వినాలని చెప్పాలి. స్నానాలు చేసే దగ్గర, దుస్తులు మార్చుకునే ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సున్నితంగా వివరించాలి.
ఇంట్లోనూ అప్రమత్తంగానే..
చిన్నారులపై జరిగే అత్యాచారాల్లో 60 శాతం ఆ కుటుంబానికి బాగా తెలిసున్న వ్యక్తుల కారణంగానే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. బంధువులు, స్నేహితులు, పిల్లలు ప్రేమగా 'అంకుల్' అని పిలిచే వాళ్లే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. అమ్మానాన్నలు ఇంట్లో లేనప్పుడో, ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లినప్పుడో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
బంధువులైనా, దగ్గరి స్నేహితులైనా, టీచర్త్లెనా ఇంకెవరైనా వ్యక్తిగత భాగాలను తడమడం, హత్తుకోవడం, దగ్గరకు తీసుకోవడం లాంటివి చేసినప్పుడు.. ఆ స్పర్శ అసహజంగా అనిపించినప్పుడు వెంటనే అక్కడి నుంచి వచ్చేయమని పిల్లలకు వివరించాలి. వాళ్లు ఎంత కావాల్సిన వాళ్త్లెనా మొహమాట పడకుండా విషయాన్ని మీకు చెప్పమని చెప్పాలి. అలాంటి సందర్భాల్లో 'అతను అలాంటి వాడు కాదు' అంటూ కొట్టిపడేయకుండా వాళ్లు చెప్పిన దాంట్లో ఎంతమేరకు నిజముందో కనుక్కునే ప్రయత్నం చేయాలి.
ఎలా గుర్తించాలి?
లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో ఏదో తెలియని ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. మునుపటి ఉత్సాహం వాళ్లలో తగ్గిపోతుంది. సరిగ్గా నిద్రపోలేరు. కొన్నిసార్లు భయమూ, బెరుకూ ఉంటాయి.
మీదే ముఖ్య పాత్ర!
ఏ విషయాన్నైనా పిల్లలు మీతో స్వేచ్ఛగా పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. వాళ్లకు ఎదురైన పరిస్థితుల గురించి చెబుతున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అలాగని అతిగా కూడా స్పందించకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా అమ్మానాన్న తోడుగా ఉంటారన్న భరోసా వాళ్లకు కలగజేయాలి. అప్పుడే వాళ్లు అన్ని విషయాలను మీతో పంచుకోగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!