థైరాయిడ్ సమస్య ఉంది.. మందులు మధ్యలో మానేయచ్చా?

హలో డాక్టర్‌.. నా వయసు 24. నాకు హైపోథైరాయిడిజం సమస్య ఉంది. తొలుత 100 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ వాడాను.

Published : 04 Apr 2022 18:43 IST

హలో డాక్టర్‌.. నా వయసు 24. నాకు హైపోథైరాయిడిజం సమస్య ఉంది. తొలుత 100 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ వాడాను. ఆ తర్వాత డాక్టర్‌ పరీక్షించి 25 ఎంసీజీ వాడమని సలహా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ టెస్ట్‌ చేసి ఇక వాడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ నేను 25 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ కొనసాగిస్తున్నాను. థైరాయిడ్‌ అనేది దీర్ఘకాలిక సమస్య అయినప్పుడు ట్యాబ్లెట్స్‌ మధ్యలో మానేసినా సమస్యేమీ ఉండదా? పైగా నేను చాలా తక్కువ బరువుంటాను. ప్రస్తుతం 35 కిలోలున్నా. నేను బరువు పెరగాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

థైరాయిడ్‌ సమస్య కోసం మొదట మీకు ఎక్కువ డోస్‌ ఇచ్చి తర్వాత డోసు తగ్గించారని చెప్పారు. అయితే డాక్టర్‌ మందులు వాడాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా ఇంకా ఎందుకని మీరు ట్యాబ్లెట్స్‌ కొనసాగిస్తున్నారు? థైరాయిడ్‌ ఓవర్‌ కరెక్షన్‌ అయితే కూడా మీ బరువు బాగా తగ్గిపోవచ్చు. అందుకని మీరు ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదించండి. వారు అన్ని పరీక్షలు చేసి చూసి మీ సమస్య ఏంటి? అసలు మీరు బరువు ఎందుకు తగ్గుతున్నారు? వంటివన్నీ సరిగ్గా చెప్పగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్