close
Updated : 03/11/2021 16:21 IST

వెన్నెల కాంతులలో పండగల పరవళ్లు..!

వెన్నెల కాంతులతో అంబరానికే సొగసుని తీసుకొచ్చే రుతువు శరదృతువు.ఈ రుతువులో చాంద్రమాన మాసాలైన ఆశ్వయుజ, కార్తీకాల్లో పండగల వెల్లువ ప్రతిఒక్కరినీ భక్తిపారవశ్యంలో, ఆనంద డోలికల్లో ముంచెత్తుతుందంటే సందేహం లేదు. దేవీనవరాత్రులతో పాటు విజయదశమి, దీపావళి, కార్తీక పూర్ణిమ, నాగులచవితి.. మొదలైన పండగలు, పర్వదినాలు ఈ రుతువులోనే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో శరదృతువులో వచ్చే కొన్ని పండగలు, పర్వదినాలు, వాటి ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం..

ధన్‌తేరస్ (ధన త్రయోదశి)

ధన్‌తేరస్‌నే 'ధన త్రయోదశి' అని కూడా అంటారు. ఆశ్వయుజ కృష్ణపక్షంలోని పదమూడో రోజున వచ్చే ఈ పండగను ఉత్తరాదిలో ఎక్కువగా జరుపుకొంటారు. దీపావళి సందర్భంగా నిర్వహించేే ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున జరుపుకొనే ఈ పండగ నాడు ప్రత్యేకంగా మహిళలు స్వర్ణాభరణాలను కొని ధరిస్తారు. తమ సకల అభీష్టాలు నెరవేరడానికి, ధన, వస్తు, కనక, వాహన సంపత్తిని పొందడానికి ఆ మహాలక్ష్మిని కొలుస్తారు.

నరకచతుర్దశి (చోటీ దివాలీ)

దీపావళికి ఒక రోజు ముందు, ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు జనరక్షణార్థమై తన అర్ధాంగి సత్యభామ సహాయంతో నరకాసురుడిని హతమార్చాడని పురాణాలు చెబుతున్నాయి. అదే రోజును 'నరకచతుర్దశి'గా ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దీనినే కొన్ని ప్రాంతాల్లో 'చోటీ దివాలీ' అని కూడా పిలుస్తారు.

దీపావళి

ఉత్తరాదిలో 'దివాలీ'గా, దక్షిణాదిలో దీపావళిగా జరుపుకొనే ఈ దీపాల పండగ రోజునే రాముడు సతీసమేతుడై అయోధ్యకు తిరిగొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానాంధకారాలపై జ్ఞాన తేజస్సు సాధించిన విజయానికి సూచనగా దీపావళి జరుపుకొంటారని మరికొంతమంది చెబుతారు.

దివాలీ పడ్వా

దీపావళి పండగలో భాగంగా ఉత్తరాదిలో నాలుగో రోజు జరుపుకొనే వేడుకే 'దివాలీ పడ్వా'. ఈ రోజున కొత్తగా పెళ్లయిన దంపతులను ఇంటికి ఆహ్వానించి బహుమతులు, కానుకలను అందజేస్తారు. దీనికే 'గుడి పడ్వా' అని మరో పేరు కూడా ఉంది. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో 'బలి పాడ్యమి' అనే పండగను కూడా జరుపుకొంటారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని తన పాదాలతో పాతాళానికి తొక్కేశాడని అంటారు. అలాగే ఈ పర్వదినాన ఉత్తరాదిలో చాలా చోట్ల 'గోవర్థన పూజ'ను జరుపుకోవడం విశేషం.

బహు బీజ్ (భగినీ హస్త భోజనం)

ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా కొన్ని చోట్ల జరుపుకొనే ఈ పర్వదినాన అక్కలు, చెల్లెళ్లు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి మంచి విందుభోజనాన్ని వడ్డిస్తారు. దీనినే కొందరు 'భాయ్‌దూజ్', 'భగినీ హస్త భోజనం', 'భ్రాతృ ద్వితీయ' అనే పేర్లతో కూడా పిలుస్తారు. దీనికే 'యమ ద్వితీయ' అనే పేరు కూడా ఉంది. యముడి సోదరైన యమున తన సోదరుడిని విందు నిమిత్తం ఈ రోజే మొదటిసారి తన ఇంటికి ఆహ్వానించిందని ఓ కథ ప్రచారంలో ఉంది.

కార్తీక పౌర్ణమి (గురు పౌర్ణమి)

కార్తీక మాసం శుక్లపక్షంలో పదిహేనో రోజు వచ్చే పండగే కార్తీక పౌర్ణమి. ఈ రోజున చాలామంది శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేస్తారు. మహిళలు కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన భర్తలో అర్ధభాగం పొందేందుకు గాను ఈ వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. అలాగే 'కార్తీక పౌర్ణమి' రోజునే సిక్కులు 'గురు పౌర్ణమి'ని జరుపుకోవడం విశేషం.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి