మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి!

మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి!

Updated : 22 Sep 2021 12:56 IST

బుడిబుడి అడుగులేసేటప్పుడు తడబడకుండా తన వేలిని అందించి..
కోపంతో అమ్మ కాస్త ఉరిమి చూసినా.. తన గారాల పట్టిని ప్రేమగా అక్కున చేర్చుకుని..
చిన్నప్పుడు నడిపించిన ఆ చేత్తోనే అడుగడుగునా మార్గనిర్దేశనం చేసి..
వయసొచ్చాక తన యువరాణిని ఓ యువరాజు చేతిలో పెట్టి ఆశీర్వదించి..

ఇలా మన జీవితంలోని ప్రతి అడుగులోనూ నాన్న ముద్ర ఉంటుంది.  అందుకే అమ్మాయంటేనే ‘నాన్న కూచి’ అంటారంతా! ఇలా మన మొదటి హీరో అయిన నాన్న మనకు అందించిన స్ఫూర్తిని, ఆయనతో మనకున్న కమ్మనైన అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్‌ డే’. ఈ సందర్భంగా అమ్మాయిలందరికీ తమ తండ్రులతో ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి.. ఎదిగే క్రమంలో నాన్న నుంచి స్ఫూర్తి పొందే అంశాలూ ఎన్నో!

ఈ క్రమంలో- మీ జీవితంలో, మీ ఉన్నతిలో మీ నాన్న పోషించిన పాత్ర గురించి; ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాతో పంచుకోండి.. అలాగే మీ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే అందమైన ఫొటోల్ని contactus@vasundhara.net కు మెయిల్‌ చేయండి. ‘ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం.
హ్యాపీ ఫాదర్స్‌ డే!

అభిప్రాయాలను పంచుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్