అలా ఉంటేనే.. విజయం!

‘ఇక నీ కలలను పక్కన పెట్టేయ్‌’ అని నా మనసు నాకెన్నిసార్లు సలహా ఇచ్చిందో! అపజయాలంతే.. మనపై మనకు అపనమ్మకాన్ని పెంచుతాయి. ఒలింపిక్స్‌ నుంచి నా ముఖంపై మనస్ఫూర్తిగా వచ్చిన చిరునవ్వే ఎరుగనంటే నమ్ముతారా? అలాగని నిరాశలో కూరుకుపోలేదు. మధ్యలోనే వదిలేయాలనీ అనుకోలేదు.

Published : 28 Mar 2023 00:18 IST

‘ఇక నీ కలలను పక్కన పెట్టేయ్‌’ అని నా మనసు నాకెన్నిసార్లు సలహా ఇచ్చిందో! అపజయాలంతే.. మనపై మనకు అపనమ్మకాన్ని పెంచుతాయి. ఒలింపిక్స్‌ నుంచి నా ముఖంపై మనస్ఫూర్తిగా వచ్చిన చిరునవ్వే ఎరుగనంటే నమ్ముతారా? అలాగని నిరాశలో కూరుకుపోలేదు. మధ్యలోనే వదిలేయాలనీ అనుకోలేదు. శక్తినంతా ధారపోసి శ్రమించా. మనసు బాగాలేనప్పుడూ నాకు గుర్తొచ్చేది షూటింగే! అకాడమీలో ఒంటరిగా గడుపుతా. అప్పుడు మనసు తేలికపడి తెలియని శక్తి ఆవరించినట్లు అనిపిస్తుంది. తిరిగి సాధనపై దృష్టిపెడతా. అవరోధాలెన్ని రానీ సాధన చేసుకుంటూ వెళ్లడమే నా పని. సందర్భం వచ్చినపుడు నా సత్తా చూపగలిగితే చాలు. ఓపికతో వేచి ఉండేవారినే విజయం వరిస్తుందని బలంగా నమ్ముతా. తాజా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో పతకం సాధించానంటే ఆ ఓపికే కారణం. అపజయాలు ఎక్కిరించినపుడే నిబ్బరంగా ఉండగలగాలి. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. నమ్మకం కోల్పోయారో ఓటమిని ఆహ్వానించినట్టే! కాబట్టి.. ఓపిక వహించండి.. విజయం వరించడం ఖాయం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్